తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ఏ తెలుగన్నది కాదు, ఎలా రక్షించుకోవాలన్నదే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవ్వాళ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఓ సభ ఏర్పాటు చేసి నలుగురిని పిలుస్తాం. పిలిచిన వక్తలు నలుగురు మాట్లాడ్డంతో మాతృభాషా దినోత్సవం మరో ఏడాది వాయిదా.
మాతృభాషా దినోత్సవ సభలు కొద్ది ఏళ్లుగా మనదగ్గర జరుగుతున్నాయి. ఒక సభకి మరో సభకి మధ్య దీర్ఘనిద్ర. నిశ్శబ్దం. అటు ప్రభుత్వాలని ప్రసన్నం చేసుకోలేక, ఇటు ప్రజలను తట్టి లేపలేకపోయే పరిస్థితి.
తాటిపండు బట్టతలవాడిపైనే పడినట్లు, రాష్ట్ర విభజన భాషోద్యమ నాయకులపైనే పడింది. తాటిపండు కాస్త పచ్చి వెలక్కాయలా మారి గొంతులో దూరింది. ఇది వాస్తవం. భాషోద్యమం అభిమానిగా లోగడ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ప్రజల అభీష్టం మేరకు పాలకవర్గాలు, సంపన్న సామాజిక వర్గాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అసంభవమైన విభజన పెప్పర్ స్ప్రేల మధ్య సునాయాసంగా జరిగిపోయింది. ఒక పెద్ద సమస్య, సంఘర్షణ నుండి ప్రజలు ఉపశమనం పొందారు. విభజన వల్ల ప్రజలకు, పార్టీలకు కలిగే లాభనష్టాల మాట అటుంచుదాం. కొన్ని భాషా పరమైన అంశాలు గురించి మాత్రం ఆలోచిద్దాం.
సున్నితమైన అంశాల గురించి మాట్లాడకపోవడం మన 3సంస్కృతి. అంటే శిష్ట సంస్కృతి. ఇది పెత్తందారీ ఆలోచనా విధానంలోంచి రూపొందుతుంది. వామపక్షాలు కావచ్చు, ప్రగతిశీల విప్లవ పొరాటకారుల మేధస్సులు కావచ్చు. ద్వంద్వనీతి తెలుగువారికి ఒక గొప్ప వెసులుబాటు. సున్నితాంశాలను చూసీ చూడనట్లు పెడితే అవి మన జోలికి రావని భావన. కాని ఓనాడు కాకుంటే మరోనాడు అవి మనముందుకు వచ్చి మనకే ప్రశ్నార్థకాలై గుచ్చుకుంటాయి. అప్పుడైనా అంగీకరించాలి. లేదా మరో తప్పు చెయ్యాలి. మరింత నిశ్శబ్దం కావాలి. లేదా మరింత స్వీయ రక్షణ గోడల్లో తలదూర్చాలి.
అలాంటి సున్నితాంశాలలో జాతి, మతం, కులం, భాష, సంస్కృతుల వంటివి ముఖ్యమైనవి. వీటిని పక్కన పెట్టడం వల్ల మన సమాజంలో చాలా సమస్యలు పొరలుపొరలుగా పేరుకుపోయాయి. చాలా చైతన్యం గడ్డకట్టుకుపోయింది. గుదిబండల్లా అవి చలనానికి అడ్డంకులయ్యాయి. అంగలు వేయడానికి ఆటంకమయ్యాయి. ఇప్పుడు అవే మనల్ని వేటాడుతున్నాయి.
కులం సమస్య పరిష్కరించనంతకాలం అది దేశాన్ని వెనక్కి వెనక్కి లాగుంతుంటుంది. మహమ్మారిలా మనల్ని పీడిస్తూనే ఉంటుంది. ఒక అనాగరిక అంశాన్ని పాటిస్తూ నాగరికుల్లా మనం మనలేం. ఎంత అత్యాధునిక కాలంలో జీవిస్తున్నా, ఆధునిక సాంకేతిక వైభవాలలో బతుకు ఆనందాన్ని ఆస్వాదిస్తున్నా, అది మన బార్బరికతకు అద్దమై మన క్రీనీడై మనల్ని వెన్నంటి వస్తుంది. ఒకే దేశంలో పుట్టిన మతాల మధ్య హెచ్చు తగ్గులు, ఉచ్ఛనీచాలు తగ్గాలి. ఈ దేశంలో పాటింపబడుతున్న ఇతర మతాల మధ్య మరింత అవగాహన పెరగాలి. రెండు వైపుల నుండి ఒక సౌహార్ద వాతావరణం నెలకొనాలి. చర్చల రూపంలో అగ్రభావాలకు అడ్డుకట్ట పడాలి. అప్పుడే సరిహద్దులకావలి శక్తుల ప్రమేయం తగ్గుతుందని అనిపిస్తుంది. మతం పేరుతో ఉగ్రభావన, అగ్రభావన ఎంత తప్పో దానివల్ల ఎంత ఉత్పాతం కలుగుతున్నదో ఈ దేశం నుండి ఒక సందేశం ప్రపంచానికి అందాలి.
ఇకపోతే-
ఈ నేల మీద మానవ సంచిత జ్ఞానాల్లోంచి పుట్టిన ఆరువేల భాషల్లో, వివిధ కారణాలవల్ల సగం భాషలు, లిపులు పూర్తిగా అంతరించిపోయాయి. మిగతా వాటిలో ఆరువందల భాషల వరకు వెనకపట్టుపట్టే దశలో ఉన్నాయ. మరీ ముఖ్యంగా ఆదివాసీ భాషలకు ఈ పరిస్థితి మెడపై వేలాడే కత్తి. వారి బతుకుల్ని నిస్తాపనకు గురిచ్తే, వారి భాషలను సంస్కృతుల్ని కాపాడలేం. ఆంగ్ల మాధ్యమంలో బడులకు పిల్లల్ని పంపుతూ తెలుగు భాషను బతికించలేం. పాలన సైతం పరాయ భాషలో చేస్తూ తల్లి నుడిని వికసింప చేయలేం. సంస్కృతం, ఇతర పరభాషా పదజాలం వలలోచిక్కుకొని తెలుగు భాషను బతికించలేం. సంస్కృతం గొప్ప భాష. అంతమాత్రాన అది మాతృభాష కాజాలదు. తెలుగు భాష ప్రత్యామ్నాయం అసలే కాజాలదు. అది దైవభాష, నేలమీద నడయాడే తల్లి బురద పాదాల నుడి కావడం కష్టం.
భాషలపై ప్రభావాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు చాలా రకాలుగా ఉంటాయి. ఉండాలి. కాని పదాలు ఒక భాషలోకి విచక్షణా రహితంగా చేరడం ఆత్మహత్యా సదృశం. ఆదాన ప్రదానాలు సమానంగా లేకపోతే దానిని ఏకపక్ష భాషా దాడిగానే భావించాలి. లిపిలోకి అనేక అక్షరాలు చేర్చడం వల్ల అసలు తెలుగు వర్ణమాలకి విఘాతం కలుగుతుంది. అలాంటి పరిస్థితి ఒకటి తెలుగుకి ఎదురయ్యంది. ఈ సున్నితమైన విషయాన్ని ఇప్పుడు విజ్ఞులు అంగీకరించి తీరాలి. ఇప్పుడు అంగీకరించకున్నా మరెప్పుడైనా ఈ విషయాన్ని ఒప్పుకొని తీరాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుగు మాతృభాష. మరి తెలంగాణ ప్రజలకి ఏది? తెలంగాణలో ఏ భాష ఉందో అదే తల్లి బాస. తెలంగాణ ప్రజలు తమది ఏ తెలుగో, ఏ భాషో వారికే తెలుస్తుంది. వారే చెబుతారు కూడా. ఇది మరో సున్నితమైన అంశం.
మూల ద్రావిడం నుండి తమిళ, కన్నడ, తెలుగు, మళయాళ భాషలు ఏర్పడ్డాయని భాషా శాస్తజ్ఞ్రులు చెబుతారు. తమిళం నుండి మళయాళం నాలుగైదు వందల ఏళ్ళ కింద విడిపోయిందని అంటారు. అలాగే తెలుగు కన్నడ భాషలు పరస్పరాధారితాలు. ఏకలిపి కలిగి ఉండి, కాలక్రమంలో రెండు విడివిడి లిపులుగా చీలిపోయాయి. భాషా లిపులు, విడిపోవడం వెనుక అనేక రాజకీయ, భౌగోళిక, సాంస్కృతిక హేతువులు బలంగా ఉంటాయి. చాలాసార్లు ఇవి విడిపోవడం అభివృద్ధికి చిహ్నంగానే ఉన్నాయి.
అలాగే రాష్ట్రాలు విడిపోవడానికి ప్రధాన కారణాల్లో భాష కూడా ఒకటి.
లోగడ గల సరిహద్దులు మారాయి. సంస్కృతులు, ప్రభుత్వాలు మారాయి. జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. ప్రజల మధ్య రెండు దశాబ్దాలుగా ఏనాడూ అభిప్రాయ భేదాలు తలెత్తలేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈసారి మాతృభాషా దినోత్సవం వచ్చింది. గత రెండేళ్లుగా తెలంగాణ ప్రజలు తమ భాష ప్రత్యేకమైనదని, దానికి గౌర వం, గుర్తింపు ఉండాలని భావిస్తున్నారు. ఇప్పుడు ఆ భాషను కాపాడుకోవడానికి కూడా ఆలోచనలు చేస్తున్నారు. తమ భాషపై అమోఘమైన ఆదరాభిమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాండలికం అనే పదాన్ని నిరాకరించి దానిని3్భష2 అని అంటున్నారు. 3యాస2 స్థాయి నుండి బాస2 అని ఘోషిస్తున్నారు. 3యాస2 స్థాయి నుంచి 3బాసగా గుర్తింపబడాలని యోచిస్తున్నారు.
పదిహేను రోజుల క్రితం తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలంగాణ తెలుగుపై ఒక చర్చాగోష్టి ఏర్పాటు చేశారు. ఆ భాషపై ఒక ఎంఏ కోర్సుని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. వౌఖిక లిఖిత సాహిత్యం ఎంత ఉందో అని బేరీజు వేస్తే మరో రెండు కోర్సులకు సరిపడేంత ఉన్నదని తేలింది.
అందుకే తెలంగాణా తెలుగు భాష అని పిలవడం సబబు అని చాలామంది అన్నారు. 1943లో గోలకొండ పత్రికలో సురవరం ప్రతాపరెడ్డి ‘‘తెలంగాణ తెలుగు’’22 అంశంపై సంపాదకీ యం రాశారు. అందులో ధాతువులు ఒకటే అయినంత మాత్రాన పద స్వరూపం ఒకటి కాదని చెప్పాడు. సర్కారు జిల్లాల్లో 34‘‘వారు గాని ఈ వైపుకు ఏమైనా వచ్చారా?’’22 అనే వాక్యానికి తెలంగాణలో 34 ‘‘ఆల్లు గిట్ట గిసొంట గానొచ్చిండ్రా?’’2 అని అంటారు. ఈ రెండు వాక్యాలు తెలుగే. కాని రెండు విడివిడి తెలుగు భాషలకున్నంత తేడా కానవస్తున్నది. అగ్ని అని అక్కడ అంటే ఇంగలం అని ఇక్కడ, ‘‘అమ్మాయి’’ అని అక్కడ అంటే 3‘‘పోరి’’2 అని ఇక్కడ, ‘‘వెంట్రుకలు’’ అని అక్కడంటే ‘‘తుప్పలు’’ అని పాలమూరులో అంటారు. ఇలాంటి పద ఉదాహరణలు అనేకం. ఇంతకీ చెప్పేదేమంటే ఈ భాషని గౌరవించనివారు, గుర్తించని వారు, కాపాడాలని అనుకోనివారు, చాలామంది ఉన్నారు. వారి భాష అయిన తెలుగు తెలుగు అని తెలంగాణ తెలుగు భాషకు ఎందుకు పిలుచుకోవాలి అని అంటున్నారు. ఇంగ్లీషుని అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటిష్ ఇంగ్లీషు అని విడివిడిగా పిలుచుకుంటున్నారు. నిఘంటువులు (రాండమ్ హౌజ్, ఆక్స్‌ఫర్డ్)కూడా వేరు వేరుగా ఉన్నాయి. తెలుగుకి కూడా అలాగే రెండు నిఘంటువులు ఉంటే తప్పెట్లా అవుతుంది. అందుకే ఈ ఏడాది నుండి వారు మాతృభాషా దినోత్సవాన్ని తెలంగాణా తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకోవాలని భావిస్తున్నారు. ఇది కొంతమందికి రుచించకపోవచ్చునేమో కాని తప్పదు. బాధ కలిగే కొద్దిమంది ఏనాడూ తెలంగాణ భాషకి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చెప్పలేకపోయారని అనుకోవడం గుర్తించాలి.
భాష చాలా సున్నితమైన అంశం
ఒకే తల్లికి పుట్టిన వారు వేరువేరు కుటుంబాలలో, వేరువేరు ప్రాంతాలలో, వేరువేరు దేశాలలో జీవిస్తున్నా వారి మధ్య ప్రేమాభిమానాలు, సఖ్యత ముఖ్యం. అవి పెరగాలి. భాష ఒక్కదానికే మనుషుల్ని కలిపే శక్తి లేదు. అలాగైతే చరిత్రలో ఇన్ని భాషలు పుట్టేవి కావు. ఇంత దూరం వచ్చేవాళ్లం కాదు. భాష చుట్టూరా అనేక పెత్తనాలు ఉంటాయి. భాషని ఆసరా చేసుకుని జాతి అనే అంశం కూడా ఒఖూచ్ఘిషళ అవుతుంది.
భారతజాతిలో అనేక జాతులు ఉన్నట్లుగానే, ఒకే జాతీయుల మధ్య శత్రుత్వాలు, వరస హత్యలు ఉన్నట్లుగానే భాషలో సైతం అనేక హెచ్చు తగ్గులు, మార్పులు ఉంటాయి. భాషజాలు పదాల కన్నా మానవుల మధ్య సహజాతంగా ఉండే ప్రేమాభిమానాలు, ఐక్యత ముఖ్యం. ప్రపంచీకరణ పీకలలోతుగా మనల్ని ఆవరించింది. ప్రపంచీకరణని, ఏకధృవ ప్రపంచాన్ని దాని మానాన దానిని వ్యాపింప జేస్తూ 3జాతిని, జాతీయతని ఎలా కాపాడుకోగలం? అందుకే స్థానికమైన తెలుగును బతికించుకోవలసిన అగత్యం ఏర్పడింది. తెలంగాణ తెలుగుభాషని రక్షించుకోవడానికి తెలంగాణ ప్రజలకు సీమాంధ్ర భాషోద్యమకారులు సహకరించాలి. అట్లాగే ఉత్తరాంధ్ర, రాయలసీమల తెలుగు భాషల పరిరక్షణకు భాషాభిమానులు ప్రత్యేక ఆలోచనలు చేయాలి. నవీన రీతిలో ఉద్యమాలు చేపట్టాలి.
ఈ మాతృభాషా దినోత్సం సందర్భంలో రాజకీయ జన తాత్విక రంగాలలోంచి భాషని, భాషీయుల అస్తిత్వాన్ని, సంస్కృతిని పరిరక్షించుకోవడానికి వీలుగా కొత్త ఆలోచనలు చేయాలి. కొత్త అంశాలతో ప్రణాళిక రాయాలి.
మాతృభాషను రక్షించుకోవాలన్న చైతన్యం ముఖ్యం. కాని ఏ భాషను, ఏ తెలుగును అన్నది అంత ముఖ్యం కాదు. ఏ తెలుగయినా బట్టకట్టాల్సిందే. రాబోయే తరాలకి ఎలాంటి దేశాన్ని, ఎలాంటి పౌర సమాజాన్ని, విలువలను అందిస్తామో మన చేతిలో లేదు. కానీ వారికి తల్లి భాషాసంపద. పరిమళాలను మాత్రం వారసత్వంగా అందించే బాధ్యత అందరిది.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 9951942242