జయహో

నిరంతరం సాగిపోండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నా చేతిలో వున్న పనిని ప్రతిరోజూ చేస్తూండడంవలన నాకు విజయం సాధ్యమైంది’’- జానీ కార్సన్
విజయం సాధించడంలో కొంతమంది ఇతరులకన్నా ముందు ఎందుకున్నారన్న విషయం తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలుగా ఎన్నో అధ్యయనాలు జరిగాయి. కొన్ని వందల, వేల మంది సేల్స్ పీపుల్స్, సిబ్బంది, మేనేజర్లను ఇంటర్వ్యూ చేశారు, పరీక్షించారు, అధ్యయనం చేశారు. విజయం సాధించడంలోని సామాన్యాంశాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించారు. వాళ్లు మళ్లీ మళ్లీ కనుక్కున్న ముఖ్యమైన అంశం- ‘చర్య వేపు మొగ్గు’ (యాక్షన్ ఓరియంటేషన్) అనేది.
విజేతలు చర్యవైపు ప్రగాఢంగా మొగ్గుచూపుతారు. వైఫల్యం చెందిన వారికన్నా వేగంగా వాళ్లు కదులుతుంటారు. వాళ్లెప్పుడూ పనిలోనే ఉం టారు. వాళ్ళు ఇంకా, మరింకా.. కష్టపడి పనిచేస్తుంటారు. పొద్దునే్న ముందుగా పని ప్రారంభించి, సాయంకాలం కొంచెం ఆలస్యంగానే పనిచేస్తారు. ఎప్పుడూ చైతన్యవంతులుగానే ఉంటారు.
ఇకపోతే పరాజితులు తమ పనినెప్పుడూ ఆలస్యంగానే మొదలుపెట్టి, మధ్యలోనే విడిచిపెట్టేస్తుంటారు. అయితే కాఫీ బ్రేక్‌లను, లంచ్ బ్రేక్‌లను, మెడికల్ లీవ్‌లను సెలవు దినాలని మాత్రం ప్రతిక్షణం గుర్తుంచుకుంటారు. అప్పుడప్పుడూ వాళ్లు ‘నేను ఆఫీసులో లేనప్పుడు, పని గురించి ఎప్పుడూ ఆలోచించను’ అని గొప్పలకు పోతుంటారు.
తన ప్రసిద్ధ వ్యాసం ‘నష్టపరిహారం’లో రాల్ఫ్ వాల్డో ఎమర్సన్- మీరు చేసిన కృషి యొక్క విలువకు ప్రత్యక్షానుపాతంగా మీకెప్పుడూ సరైన ఫలితం జీవితంలో దొరుకుతుందని రాశాడు. మీ పురస్కారాలూ బహుమతుల పరిమాణాన్ని పెంచాలనుకున్నపుడు, మీ ఫలితాల గుణాలని, సంఖ్యనీ పెంచాలి. మీరు ఎక్కువగా దేనిలోంచి తీసుకోవాలని అనుకుంటే, అందులో ఎక్కువగా వేయాలి. మరో మార్గంలేదు.
నెపోలియన్ హిల్ విజయం సాధించిన స్ర్తి పురుషులలోని ఒక ముఖ్యమైన గుణాన్ని గుర్తించాడు. వారిలో చాలామంది చాలా బీదవాళ్లు, దిగువనుంచి తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు, తమ జీవితం ప్రారంభదశలోనే మరో మైలు ముందుకు వెళ్లాలనేది అలవాటు చేసుకున్నారు, అదనంగా నడవవలసిన మైలు దూరంలో ఎలాంటి ట్రాఫిక్ జామ్స్ ఉండవు’ అన్న పాత నానుడిలోని అర్థాన్ని వాళ్లు తెలుసుకున్నారు.
ధామస్ జెఫర్‌సన్ ఇలా రాశాడు- ‘‘సోమరిగా ఎప్పుడూ ఉండనని నిర్ణయం తీసుకోండి. ఎవరైనా తనకున్న సమయాన్ని వృథా చేయనంతకాలం, ఆ వ్యక్తికి తనకి టైము సరిపోవడంలేదన్న ఫిర్యాదు చేసే అవకాశమే రాదు. మనం నిరంతరం పనిచేస్తూ పోతుంటే, మనం ఎంత పనిచెయ్యగలమో చూస్తే ఎంతో ఆశ్చర్యం చెందుతాం.
తరువాత ఆయన ఇంకా ఇలా రాశాడు- ‘‘నా జీవితంలో నేను పక్కమీద ఉండగా ఉదయిస్తున్న సూర్యుణ్ణి ఎప్పుడూ చూడలేదు’’.
ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఉంది. సమయం ఎప్పుడూ గడిచిపోతూనే వుంటుంది. మన జీవితంలోని వారాలు, నెలలు, సంవత్సరాలు ఎలాగో గడిచిపోతూనే ఉంటాయి. ఉన్న ఒకే ఒక ప్రశ్న- మనం మనకున్న సమయంలో ఏం చేయదలచుకున్నాం?
రోజూ ఎలాగూ గడిచిపోతున్నపుడు, పనిని ముందుగా ఎందుకు ఆరంభించకూడదు? మరికొంచెం ఎక్కువ ఎందుకు కష్టపడకూడదు? ఇంకాసేపు ఎందుకు పనిచెయ్యకూడదు? అందరిలోకీ బాగా పనిచేసే వ్యక్తిగా పేరెందుకు తెచ్చుకోకూడదు? ఏదైనా ఒక పని త్వరగా బాగా జరిగేటట్టు చూసే వ్యక్తి కావాలనుకున్నపుడు, అది మనమే ఎందుకు అవకూడదు? దీనితో మన వృత్తి జీవితం, మనం ఊహించినంత వేగంగా ముందుకు దూసుకుపోతుంది.
‘‘విజయం యొక్క వేగ గతి సిద్ధాంతం’’ (మొమెంటమ్ ప్రిన్సిపల్ ఆఫ్ సక్సెస్) అని ఓ అంశం ఉంది. మనకు చలనం కలిగించి, కదిలించడానికి ఎంతో శక్తి అవసరం అవుతుందని ఈ సిద్ధాంతం అంటుంది. కానీ మనం కదలటం అంటూ ఒకసారి మొదలెట్టాక, మనం ముందుకు పోవడానికి అట్టే శక్తి అవసరముండదు.
విజయం సాధించేవాళ్లందరూ తమ రోజులని గంటలని చివరికి పావుగంటలని కూడా అతి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. ఈ విషయం గురించి జరిపిన ప్రతీ అధ్యయనంలోనూ సమయాన్ని పూర్తిగా వాడటం కోసం వేసే ప్రణాళికకే ఎక్కువ ఆదాయం సంపాదించటానికీ మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది అని తెలిసింది.
మానసికంగా, శారీరకంగా మనం ఎంత వేగంగా కదలగలిగితే, మనకు అంత శక్తి ఉంటుంది. ఎంత వేగంగా కదిలితే, అంత సంతోషంగా ఉంటాము. ఎంత ఉత్సాహభరితంగా ఉండగలిగితే అంత సృజనాత్మకంగా ఉండగలుగుతాం. మనం ఎంత వేగంగా పనిచేయగలిగితే అంత ఎక్కువ పనిని పూర్తిచేయగలం. అంత ఎక్కువ సంపాదించగలం. అంత అధికంగా విజయం సాధించినట్లు అనుభూతి చెందగలం.
వేగ గతి సిద్ధాంతాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. ఒకసారి మనం వెళ్లడం మొదలుపెడితే, ముందుకు వెళ్తూనే ఉండాలి. టైమ్ మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్ (సమయ నిర్వహణా నిపుణుడు) అలన్ లేకిన్ అంటాడు- ‘‘ విజయం సాధించడానికి వేగ గతి (్ఫస్ట్ టెంపో) అత్యవసరం’’. టామ్ పీటర్స్ విజయం సాధించిన అందరికీ కార్యసాధనా ప్రవృత్తి ఉంటుందని అంటాడు. మరింత అధికంగా పనిచేయడానికి కీలకం- మనం అతి ముఖ్యమైన పనిని ఎంపిక చేసుకుని అప్పుడు దానిని తక్షణం మొదలుపెట్టాలన్న అభిప్రాయంతో ఉండాలి. విజయానికీ, కార్యసాధనకీ ఇదే నిజమైన కీలకం!
*

-శృంగవరపు రచన 9959181330