శ్రీకాకుళం

ఘనంగా శారదామాత జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 1: రామకృష్ణ పరమహంస సతీమణి శారదామాత జయంతి ఉత్సవాన్ని శ్రీకాకుళం రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దపాడులోని ఎస్‌ఆర్‌ఏ పాఠశాలలో నిర్వహించారు. శారదామాత చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణసేవా సమితి అధ్యక్షుడు పూడి తిరుపతిరావు, కన్వీనర్ ప్రధాన ఆదినారాయణ, ప్రతినిధులు కలగ ఆదికేశవరావు, ధనలక్ష్మి, పాఠశాల హెచ్‌ఎం స్వర్ణలత, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా నూతన సంవత్సర వేడుకలు
ఎచ్చెర్ల, జనవరి 1: నూతన సంవత్సర వేడుకలను అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా శుక్రవారం జరుపుకున్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మి స్వగ్రామమైన ఎస్‌ఎం పురంలో సందడి కనిపించింది. జిల్లా నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు నేతలు పెద్ద సంఖ్యలో చేరుకొని జెడ్పీ చైర్ పర్సన్ దంపతులైన చౌదరి ధనలక్ష్మి-బాబ్జీలను ఆభినందించారు. జెడ్పీ సిఇవో నగేష్ తమసిబ్బందితో అక్కడికి చేరుకొని ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఎంపిడివోలు, ఎంపిపి, జెడ్‌పిటిసి సభ్యుడు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలతో ఆ పరిసరాలు కిటకిటలాడాయి. బొకేలు, కేక్‌లు, పుస్పగుచ్ఛాలు, నేతి మిఠాయిలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీరాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వాహనాల్లో తమ్ముళ్లంతా రాజాంకు పరుగులు తీశారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ హెచ్ లజపతిరాయ్ క్యాంపు కార్యాలయానికి ఆచార్యులు బోధనా, బోధనేతర సిబ్బంది చేరుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎంపిపి బల్లాడ వెంకటరమణారెడ్డి స్వగ్రామమైన కుప్పిలిలో ఇదే సందడి నెలకుంది. వివిధ గ్రామాలనుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకొని రమణారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.