జాతీయ వార్తలు

కంచి పీఠాధిపతి జయేంద్ర నిర్దోషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: కాంచీపురంలో శంకరమఠం ఆడిటర్ రాధాకృష్ణన్‌పై దాడికి సంబంధించిన కేసులో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతితో పాటు మరో ఎనిమిది మందిని నిర్దోషులుగా పేర్కొంటూ చెన్నైలోని సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పును ప్రకటించింది. 2002 సెప్టెంబర్ 20న ఆడిటర్ రాధాకృష్ణన్, ఆయన భార్య జయశ్రీ, సహాయకుడు కృష్ణన్‌పై ఆగంతకులు దాడి చేశారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే శంకరమఠం విమర్శకుడు శంకరరామన్ కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో హత్యకు గురయ్యారు. ఈ హత్యకేసుకు సంబంధించి 2004 నవంబర్ 11న జయేంద్ర సరస్వతిని మహబూబ్‌నగర్‌లో అరెస్టు చేశారు. హత్యకేసు విచారణ సమయంలోనే- ఆడిటర్‌పై దాడిలోనూ జయేంద్ర ప్రమేయం ఉందని పోలీసులు అభియోగాలు మోపారు. ఆడిటర్‌పై హత్యాయత్నం, దాడికి సంబంధించిన కేసులో జయేంద్రతో పాటు మరో 9 మంది నిందితులు విచారణను ఎదుర్కొన్నారు. ఈ కేసులో జయేంద్ర, మరో 8 మంది నిందితులని కోర్టు తీర్పునిచ్చింది.