జాతీయ వార్తలు

జ‌య‌ల‌లిత మృతి ద‌ర్యాప్తు ఆపాల‌న్న సుప్రీంకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతిపై ద‌ర్యాప్తు చేప‌డుతున్నక‌మిష‌న్‌కు సుప్రీంకోర్టు బ్రేక్‌లు వేసింది. 2016లో అపోలో హాస్ప‌ట‌ల్‌లో 75 రోజులు చికిత్స పొందిన త‌ర్వాత జ‌య మ‌ర‌ణించారు. ఆ కేసులో అపోలో డాక్ట‌ర్ల‌ను ఎంక్వైరీ క‌మిష‌న్ విచారిస్తున్న‌ది. చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం అపోల్ వేసిన పిటీష‌న్‌ను అనుకూలంగా తీర్పునిచ్చింది. అపోలో అభ్య‌ర్థ‌న‌ను మ‌ద్రాసు హైకోర్టు తిర‌స్క‌రించ‌డంతో.. ఆ హాస్ప‌ట‌ల్ సుప్రీంకు వెళ్లాల్సి వ‌చ్చింది. జ‌య మ‌ర‌ణంపై విచార‌ణ చేప‌డుతున్న క‌మిష‌న్‌.. ఎంజీఆర్‌కు ఇచ్చిన చికిత్స వివ‌రాల‌ను కూడా కోరుతున్నద‌ని అపోలో కోర్టుకు విన్న‌వించింది