ఆంధ్రప్రదేశ్‌

కమ్మవారిని పట్టించుకోని చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 5: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు కమ్మ కులాన్ని పట్టించుకోవటంలేదు. ఓట్ల కోసం, పదవి కోసం ఓ కులానికి మాత్రమే కొమ్ముకాస్తున్నారు. ఇది మంచిపద్ధతి కాదు. పార్టీని అంటిపెట్టుకుని ప్రతిష్ఠ నిలబెడుతున్నవారిని చిన్నచూపు చూస్తున్నారు’ అంటూ గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో కాకతీయ కనె్వన్షన్ సెంటర్‌లో ఆదివారం కమిటీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఎంపి రాయపాటి మీడియా ఎదుటే టిడిపి అధినేత చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. పార్టీకోసం పనిచేసే వారిని ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కమ్మవర్గం నేతలు అదేమని ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు. నేను టిడిపిలో జూనియర్‌ను. అందువల్లే నేను గట్టిగా అడగటంలేదు’ అని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు శ్రమిస్తున్న క్యాడర్‌లో చాలా నిరుత్సాహం నెలకొందని తెలిపారు. ఇది పార్టీ మనుగడకు మంచిది కాదన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోనహనరెడ్డి అధికారంలోకి రాడని అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి వంటి ప్రముఖులు ధీమా వ్యక్తం చేస్తున్నారని అంటూ చంద్రబాబు కానీ, లోకేష్ కానీ మరో 15 ఏళ్లు టిడిపి అధికారంలో ఉంటుందని రాయపాటి అన్నారు. ‘నేను ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను. ఎవరికీ భయపడాల్సిన అవసరంలేద’ని తేల్చిచెప్పారు. ‘ప్రభుత్వంలో రిటైర్డ్ ఐఏఎస్‌లకు సిఎం ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్లను నెత్తికెక్కించుకోవడం మంచిపద్దతి కాద’ని కూడా రాయపాటి సూచించారు.

రాయపాటి సాంబశివరావు