జాతీయ వార్తలు

ఎమ్మెల్సీ మనోరమ కోసం పోలీసుల గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: బిహార్‌లో అధికార జెడియు పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మనోరమ దేవి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తన కారును ఓవర్‌టేక్ చేశాడన్న ఆగ్రహంతో మనోరమ కుమారుడు రాకీయాదవ్ గయలో ఓ యువకుడిని తుపాకీతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. మంగళవారం రాకీని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. మనోరమ ఇంట్లో సోదాలకు వెళ్లిన పోలీసులు అక్కడ మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని ఆమెపై కేసు నమోదు చేశారు. మనోరమను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ప్రకటించడమే గాక ఆమెను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. హత్యకేసులో నిందితుడైన తన కుమారుడికి ఆశ్రయం కల్పించడమే గాక నిబంధనలకు విరుద్ధంగా మద్యం సీసాలను ఇంట్లో ఉంచినందుకు ఆమెపై కేసులు నమోదు చేశారు.