కరీంనగర్

నిరుపేదలందరికీ నీడకల్పిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రాజకీయాలకు అతీతంగా ఎంపిక చేద్దాం
* సిఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి
జగిత్యాల, డిసెంబర్ 25: రాజకీయాలకు అతీతంగా గూడు లేని నిరుపేదలకు నీడ కల్పించేందుకు పారదర్శంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను ఎంపిక చేద్దాం అని సిఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు సబ్ కలెక్టర్ కె. శశాంకతో కలిసి స్థలాలను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ గూడులేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల ఎంపిక చేద్దాం రాజకీయాలకు అతీతంగా పేదలకు ఇళ్లు మంజూరుచేస్తే నీడకల్పించిన వారం అవుతామని సబ్ కలెక్టర్ శశాంకకు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సూచించారు. ఈ స్థల పరిశీలనలో మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, తహశీల్దార్ మధు, మున్సిపల్ కౌన్సిలర్లు పులి రాము, జంబర్తి శంకర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు.