రాష్ట్రీయం

జీవితా రాజశేఖర్‌పై చెక్‌బౌన్స్ కేసు కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : చెక్‌బౌన్స్ కేసులో జీవితారాజశేఖర్‌కు ఊరట లభించింది. ఎర్రమంజిల్ కోర్టు ఆమెపై ఉన్న కేసును కొట్టివేసింది. ఎవడైతే నాకేంటి అనే సినిమాకుగాను జీవిత సామా చంద్రశేఖర్ రెడ్డి వద్ద ఆమె రుణం తీసుకుంది. ఈ రుణం చెల్లింపునకుగాను ఆమె ఇచ్చిన చెక్స్ బౌన్స్ అవ్వటంతో సామ చంద్రశేఖర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీనిపై 2014లో ఎర్రమంజిల్ కోర్టు తీర్పు ఇస్తూ జీవితకు రూ.25లక్షల జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష విధించింది. తదనంతరం ఆమె బెయిల్‌పై విడుదలైన విషయం విదితమే. కాగా దీనిపై జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ తాను పరువు నష్టం కేసు వేయనున్నట్లు చెప్పారు.