రాష్ట్రీయం

మీకు అండ మా జెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేదలను అన్నింటా ఆదుకుంటా కష్టాలున్నా కన్నీరు తుడుస్తా
త్వరలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు
బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం
ఫేస్‌బుక్ జుకర్‌బర్గ్ ఆదర్శం కావాలి
పశ్చిమ గోదావరి జన చైతన్యయాత్ర సభలో చంద్రబాబు

ఏలూరు, డిసెంబర్ 3: రాష్ట్రంలో పేదలు ఎక్కడున్నా వారికి అండగా నిలుస్తామని, వారికి బాసటగా తెలుగుదేశం పార్టీ జెండా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. ఈ వర్గాల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరించేందుకే జన చైతన్యయాత్రలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం టిడిపి నేతలు, కార్యకర్తలు ఇళ్లల్లో కూర్చుంటే కుదరదని, ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని ఆదేశించారు. పూర్తి సేవాభావంతో కష్టపడుతున్న పార్టీ కార్యకర్తలను ప్రజలు కూడా ఆదరించి, వారికి సహకరించాలని కోరారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో గురువారం జరిగిన జనచైతన్యయాత్రలో పాల్గొన్న చంద్రబాబు అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. గత 18 నెలలుగా రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. సంక్షేమ పథకాల ఫలాలు పూర్తిస్థాయిలో పేదలకు అందేవిధంగా సాంకేతికంగా కూడా చర్యలు తీసుకున్నామని, ఇందులో మోసాలకు పాల్పడితే జైలుకు పంపించటం ఖాయమని స్పష్టం చేశారు. ఇంటికి పెద్ద కొడుకులా అండగా నిలబడతానని ఎన్నికల్లో ఇచ్చిన హామీ తన శక్తిమేర నిలబెట్టుకుంటున్నానని, ఇది ఎంతో సంతృప్తినిస్తోందని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ అందేలా చూస్తామన్నారు. ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని, స్థలాభావం ఉంటే వన్ ఫ్లస్ వన్, వన్ ఫ్లస్ టు విధానంలో అందరికి ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. కోతలు అధిగమించి, సమృద్ధిగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ‘ఇప్పుడు కరెంటు కోతలు ఉన్నాయా’ అని ప్రజలను ప్రశ్నించారు. లేకపోతే చప్పట్లు కొట్టి ఆశీస్సులు ఇవ్వాలనడంతో సభాప్రాంగణం చప్పట్లతో దద్దరిల్లింది. అలాగే రైతులకు కూడా ఏడుగంటల పాటు నిరంతర విద్యుత్ అందించేలా త్వరలో చర్యలు చేపడతామన్నారు.
బిసిలకు అన్యాయం జరగకుండా కాపులకు కూడా తగిన రాయితీలు అందించే విధంగా ఆలోచన చేస్తున్నామని, త్వరలోనే కమిషన్‌ను నియమిస్తామని చంద్రబాబు చెప్పారు. వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా పలు విమర్శలు చేశారు. ఆయన పత్రికలో ప్రచురించేవన్ని ఆసత్యాలేనన్నారు. అలాంటి పత్రిక చదివి మనస్సు పాడుచేసుకోవద్దంటూ హితవు పలికారు. ఇంతకుముందు తండ్రిని అడ్డం పెట్టుకుని అడ్డంగా సంపాదించిన నాయకులను ఆదరిస్తే వారు మరింత రెచ్చిపోతారని హెచ్చరించారు. ఫేస్‌బుక్ అధినేత జుకర్‌బర్గ్ చిన్నవయస్సులోనే లక్షల కోట్లు సంపాదించి తనకు కూతురు పుట్టిందన్న అనందంతో తన సంపాదనలో 99శాతం ప్రజాసేవకు వినియోగిస్తానని ప్రకటించారని, అలాంటి వ్యక్తులు మనకు ఆదర్శం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉపాధికి సంబంధించి కూడా త్వరలోనే పోస్టులను భర్తీ చేసేందుకు ఎపిపిఎస్‌సి ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఉపాధి పెరిగితేనే సమాజాభివృద్ధి సుసాధ్యమవుతుందని పేర్కొన్నారు. (చిత్రం) జన చైతన్య యాత్రలో సైకిల్ తొక్కుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు