వరంగల్

నిర్భయంగా ఓటెయ్యండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్ ఝా
వరంగల్, నవంబర్ 20: ఉప ఎన్నికలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా తెలిపారు. ఓటర్లకు స్వేచ్ఛావాతావరణం కల్పిస్తామన్నారు. ఓటర్లను ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసినా, మద్యం, డబ్బు పంపిణీ చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరు ప్రవర్తన నియమావళి పాటించాలని, పోలింగ్ స్టేషన్లకు ఓటర్లను ఇతరులు తీసుకరావద్దన్నారు. అలాగే పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల పరిధిలో ప్రజలు గుమికూడి ఉండవద్దన్నారు. అంతేకాకుండా ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుండి నేటి వరకు రూరల్ పరిధిలో ఏటూరునాగారం, భూపాలపల్లి, పరకాల, కురవి, దంతాలపల్లి, మరిపెడ, మొండ్రాయి, పెంబర్తి, చేర్యాలలో 9 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహించామన్నారు. అక్రమంగా తరలిస్తున్న 77 లక్షల 13వేల 950 రూపాయలను స్వాధీనం చేసుకొని సంబంధిత అధికారులకు అప్పగించామని అన్నారు. అలాగే శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తారనే అనుమానం ఉన్న 2540 మందిని సంబంధిత తహసీల్దార్ల ఎదుట బైండోవర్లు చేసినట్లు చెప్పారు. అలాగే తుపాకీ లైసెన్సు కలిగి ఉన్న 46 మంది నుండి కాగితాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వరంగల్ రూరల్ పరిధిలోని 791 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో 269 అత్యంత సమస్యాత్మకంగా, 274 సమస్యాత్మకంగా ఉండగా మిగతా పోలింగ్ కేంద్రాలు సాధారణంగా ఉన్నాయన్నారు. సమస్యాత్మకమైన కేంద్రాల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నామన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి ప్రజలు సహకరించాలని ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా కోరారు.