హైదరాబాద్

చెరువులో పడి ఇద్దరు విద్యార్థుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విహారానికి వచ్చి విగతజీవులైన వైనం గండిగూడెంలో ఘటన
జిన్నారం, నవంబర్ 22: విహారానికి వచ్చి విగతజీవులుగా మారిన ఘటన మెదక్ జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గండిగూడెంలో చోటు చేసుకుంది. రామచంద్రాపురం సిఐ రాంరెడ్డి కథనం ప్రకారం కూకట్‌పల్లి జెఎన్‌టియు సమీపంలోని హోలీమేరీ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు విహార యాత్రగా వచ్చి మద్యం సేవించి చెరువులో పడి మృతి చెందారు. కళాశాలకు చెందిన సాయి, రవితేజ, ఉమాశంకర్, విక్కీలు డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులు. కాగా ఉమాశంకర్ నూతనంగా బైక్‌ను ఇటీవల కొనడంతో మిత్రులకు సరదాగా పార్టీ ఇవ్వడానికి గండిగూడెం చెరవు వద్దకు వచ్చారు. అందరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం సాయి (19), రవితేజ (19)లు ఈతకని గండిగూడెం చెరువులోనికి దిగారు. ప్రమాదవశాత్తు నీళ్ళలో చిక్కుకొని ఎంతకూ పైకి రాలేదు. దీంతో పైన ఉన్న విక్కి, ఉమాశంకర్‌లు విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాలను బయటకు తీశారు. మృతి చెందిన సాయిది హైదర్‌నగర్ కాగా, రవితేజది ప్రగతినగర్ మృతదేహాలను పోస్టుమార్టం నిమత్తం పటన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉమాశంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.