అంతర్జాతీయం

భారత్‌పై పాక్, హఫీజ్ విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:కాశ్మీర్ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌పై విభ్రాంతికి గురైనట్లు పాకిస్తాన్ ప్రకటించింది. భారత సైనిక బలగాల దుందుడుకు వైఖరివల్లే కాశ్మీర్‌లో అశాంతి నెలకొందని, సైనికుల దౌర్జన్యం, బలప్రయోగం, అణచివేతవల్లే ప్రజల్లో తిరుగుబాటు ధోరణి పెరుగుతోందని పాక్ పేర్కొంది. కాశ్మీర్ ఉదంతంపై ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ పెదవి విప్పకపోవడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితులో ఆయన పేరిట విడుదలైన ఓ ప్రకటనలో భారత్‌పై విమర్శలు కురిపించారు. కాగా బుర్హాన్ ఎన్‌కౌంటర్ దారుణమని అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సరుూద్ భారత్‌పై విరుచుకుపడ్డాడు. బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ అనంతరం ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగగా భద్రతాదళాలు అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సందర్భంగా గత నాలుగు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాశ్మీర్ లోయలోని పది జిల్లాల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. పలు సంఘటనల్లో 20మంది ప్రాణాలు కోల్పోగా, 300మందికి పైగా గాయపడ్డారు.