జాతీయ వార్తలు

ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: ఉగ్రవాదులు తిష్టవేసిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో మంగళవారం ఉదయం కాశ్మీర్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని సైనికులు హతమార్చారు. పోషియార్ జిల్లాలో ఉగ్రవాదులున్నట్లు సమాచారం అందడంతో బిఎస్‌ఎఫ్ సైనికులు, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సైనికులను చూసి ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీనికి సమాధానంగా భద్రతా బలగాలు కూడా కాల్పులు ప్రారంభించాయి. పరారైన ఉగ్రవాదుల కోసం సైనికులు గాలిస్తున్నారు.