జాతీయ వార్తలు

వైద్యశాఖ దక్కలేదని కాశ్మీర్ మంత్రి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరి రెండురోజులు కాకముందే అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. ముఖ్యమంత్రి మెహబూబా తనకు ప్రాధాన్యత లేని సాంఘిక సంక్షేమ శాఖ కేటాయించారని నిరసన వ్యక్తం చేస్తూ పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు చెందిన మంత్రి సజ్జాద్ ఘనీ బుధవారం రాజీనామా చేశారు. తనకు కీలకమైన వైద్య శాఖ దక్కుతుందని ఆశించి తీరని నిరాశకు గురైనట్లు ఆయన చెబుతున్నారు. మెహబూబా తండ్రి సరుూద్ హయాంలో సజ్జాద్ పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశారు.