ఆంధ్రప్రదేశ్‌

వైకాపాకు ఎమ్మెల్యే జ్యోతుల గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వైకాపాను వీడాలా? వద్దా? అనే సంశయానికి ఆ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎట్టకేలకు తెర దించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు నెహ్రూ ఓ లేఖను పంపారు. ‘మీరు చెప్పినట్లు నడుచుకోలేక పోతున్నందుకు రాజీనామా చేస్తున్నాన’ని ఆయన పేర్కొన్నారు. నేడో, రేపో ఆయన టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.