జాతీయ వార్తలు

‘జెఎన్‌యు’కు మద్దతుగా కాశ్మీర్‌లో ప్రదర్శనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఫిబ్రవరి 19: కాశ్మీర్‌లో శుక్రవారం అల్లర్లు జరగడం మామూలే అయినా ఈ శుక్రవారం మాత్రం జెఎన్‌యు ఘటనకు మద్దతు పలుకుతూ కొత్త దారులు తొక్కాయి. అఫ్జల్ గురు ఉరిశిక్షకు నిరసనగా జెఎన్‌యులో కార్యక్రమం నిర్వహించిన విద్యార్థులకు ధన్యవాదాలు చెబుతూ ఆందోళనకారులు బ్యానర్లు ప్రదర్శించారు. ‘అఫ్జల్ మా హీరో’, ‘్థంక్యూ జెఎన్‌యు’ పేర బ్యానర్లు ప్రదర్శిస్తూ రెండొందల మంది యువకులు జామా మసీదు వద్ద ఆందోళన చేపట్టారు. అఫ్జల్ గురు అనుకూల నినాదాలు చేయడంతో పాటు పాకిస్తాన్, ఐసిస్ జెండాలను ప్రదర్శించారు. నిరసనను ప్రదర్శనను అడ్డుకునేందుకు యత్నించిన భద్రతా దళాలపై ఆందోళనకారులు రాళ్ళు రువ్వడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇద్దరు పోలీసులతో సహా ఎనిమిదిమందికి గాయాలయ్యాయి.