జాతీయ వార్తలు

జెఎన్‌యు సభ వెనుక లష్కరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: పార్లమెంటు దాడి కుట్ర కేసులో ఉరితీయబడిన అఫ్జల్ గురు సంస్మరణార్థం సభలు పెడుతున్న జెఎన్‌యు విద్యార్థులకు లష్యరే తయ్యబా అధినేత అఫీజ్ సరుూద్ మద్దతు ఉందంటూ హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అలహాబాద్‌లో చేసిన ప్రకటన అత్యంత వివాదాస్పదమైంది. రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం అలహాబాద్‌లో మాట్లాడుతూ జెఎన్‌యు విద్యార్థులకు హఫీజ్ సరుూద్ మద్దతు ఉన్నదని ప్రకటించారు. రాజ్‌నాథ్ సింగ్ చేసిన ఈ ప్రకటనను రాజ్యసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ తీవ్రంగా ఖండించారు. జెఎన్‌యు విద్యార్థులను ఉగ్రవాదులుగా అభివర్ణించటం రాజ్‌నాథ్ సింగ్‌కు ఎంత మాత్రం తగదని చెప్పారు. జెఎన్‌యు విద్యార్థులకు హఫీజ్ సరుూద్ మద్దతు ఉండటానికి సంబంధించిన సాక్ష్యాలను బైట పెట్టాలని డిమాండ్ చేశారు. దేశ హోం మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం ఎంత మాత్రం మంచిది కాదని, ఇది అత్యంత తీవ్రమైన విషయమని ఆజాద్ పేర్కొన్నారు. అయితే హోం శాఖ అధికారులు మాత్రం రాజ్‌నాథ్ సింగ్ ప్రకటనను సమర్థించారు. వివిధ నిఘా విభాగాలు సేకరించిన సమాచారం ఆధారంగానే రాజ్‌నాథ్ సింగ్ ఈ ప్రకటన చేశారని స్పష్టం చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా భారత దేశంలో ఉగ్రవాద దాడులు చేయిస్తున్న హఫీజ్ సరుూద్ జెఎన్‌యు విద్యార్తులు అఫ్జల్ గురు సంస్మరణార్థం సంతాప సభ నిర్వహించడానికి తోడ్పడటంతో పాటు వారికి మద్దతు పలికారని హోం శాఖ అధికారులు తెలిపారు. అఫ్జల్‌గురు సంస్మరణార్థం సభలు నిర్వహించటంతోపాటు ఆయన లక్ష్య సాధనకు కృషి చేస్తామని ప్రకటించిన జెఎన్‌యు విద్యార్థులకు మద్దతు ఇవ్వాలని వివిధ ఉగ్రవాద సంస్థలు, ఎన్‌జిఓలకు హఫీజ్ సరుూద్ పిలుపు ఇచ్చారని వెల్లడించారు. ఈ మేరకు ఆయన పలు ట్విటర్ సందేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. జెఎన్‌యు విద్యార్థులకు మద్దతు పలుకుతూ హఫీజ్ సయిద్ ఇచ్చిన పలు ట్వీట్‌లు తమ దృష్టికి వచ్చాయని, వాటి ఆధారంగానే రాజ్‌నాథ్ సింగ్ ఈ ప్రకటన చేశారని వివరించారు. జెఎన్‌యు విద్యార్థులకు మద్దతు ఇవ్వాలని పాకిస్తాన్ ప్రజలకు హఫీజ్ సరుూద్ పిలుపునిచ్చారని కూడా హోం శాఖ వర్గాలు తెలిపాయి. భారత్ వ్యతిరేక నినాదాలు ఇస్తున్న వారిని విమర్శించవలసిన రాజకీయ నాయకులు వారిని సమర్థించటం విచిత్రంగా ఉన్నదని బిజెపి నాయకుడు సుధాంశు త్రివేది ప్రశ్నించారు. కొందరు నాయకులు ఉగ్రవాదుల అధికార ప్రతినిధుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగానే ప్రకటనలు చేస్తుందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం వీరికెక్కడిదంటూ ఆయన రాజ్‌నాథ్ సింగ్‌ను సమర్థించారు.