జాతీయ వార్తలు

దిల్లీ కోర్టులో ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:పార్లమెంట్‌పై దాడి కేసులో దోషి అఫ్జల్‌గురుకు అనుకూలంగా, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న దేశద్రోహం కేసు విచారణకు వచ్చినపుడు కోర్టుకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బందిపై దాడి జరిగింది. ‘లాంగ్‌లివ్ ఇండియా, డౌన్ జెఎన్‌యు’ నినాదాలు చేసిన న్యాయవాదులు విద్యార్థులను కోర్టు బయటకు నెట్టేశారు. అఫ్జల్‌గురును కీర్తిస్తూ దేశవ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణపై గత శుక్రవారం విద్యార్థిసంఘం నాయకుడిపై దేశద్రోహం కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయ వివాదంగా మారిపోయింది. జెఎన్‌యు విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు వ్యవహరిస్తూండగా కేంద్రం కఠినవైఖరి పాటిస్తోంది. లష్కరేతోయిబా అధినేత హఫీజ్ సరుూద్ మద్దతుతోనే ఇదంతా జరిగిందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్న నేపథ్యంలో ఇవాళ కేసు విచారణకు వచ్చింది. అందుకోసం కోర్టుకు వచ్చిన జెఎన్‌యు అధ్యాపక సిబ్బంది, విద్యార్థులపై కొందరు న్యాయవాదులు చేయిచేసుకున్నారు. దీంతో వివాదం మరింత ముదిరినట్లయింది.