జాతీయ వార్తలు

జెఎన్‌యు వద్ద మళ్లీ ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఇక్కడి జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దేశద్రోహం కేసులో నిందితులుగా ఉంటూ ఇన్నాళ్లూ కనిపించకుండా పోయిన ఐదుగురు విద్యార్థులు గత అర్ధరాత్రి క్యాంపస్‌లో ప్రత్యక్షం కావటంతో వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. రాజద్రోహం కేసులో కన్నయ్యకుమార్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించగా మిగతా అయిదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఐతే, వైస్ ఛాన్సలర్ అనుమతి లేకుండా పోలీసులు క్యాంపస్‌లోకి వెళ్లి విద్యార్థులను అరెస్టు చేసే అవకాశం కనిపించటం లేదు. స్వచ్ఛందంగా లొంగిపోని పక్షంలో నిందితులైన ఐదుగురు విద్యార్థులను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. నిందితులు వారంతట వారే లొంగిపోయేందుకు తాము అవకాశం కల్పించినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులకు లొంగిపోవాలంటూ వైస్ చాన్సలర్ కూడా నిందితులకు నచ్చజెప్పే అవకాశం ఉంది.