జాతీయ వార్తలు

జెఎన్‌యు వివాదంలో పోలీసుల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో ఇటీవలి ఘర్షణల నేపథ్యంలో 13 మంది పోలీసులను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. దేశద్రోహం కేసులో జెఎన్‌యు విద్యార్థి కన్నయ్య కుమార్‌ను కొద్దిరోజుల క్రితం పాటియాలా హౌస్‌లోని కోర్టులో హాజరు పరచినప్పుడు విద్యార్థులు, అధ్యాపకులు, జర్నలిస్టులపై న్యాయవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. న్యాయవాదులు దురుసుగా ప్రవర్తించినప్పటికీ పోలీసులు ముభావంగా ఉండిపోయారని జెఎన్‌యు పూర్వ విద్యార్థి ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది.