బిజినెస్

11.5 కోట్ల వ్యవసాయేతర ఉద్యోగాలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ, మార్చి 13: రాబోయే పదేళ్లకుపైగా కాలంలో 11.5 కోట్ల వ్యవసాయేతర ఉద్యోగాల కల్పన భారత ఆర్థిక వ్యవస్థకు అవసరమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. రాష్టప్రతి భవన్‌లో శనివారం జరిగిన ‘గ్లోబల్ రౌండ్ టేబుల్ ఆన్ ఇంక్లూజివ్ ఇన్నోవేషన్స్’ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ వివరాలను ఆదివారం ఓ పత్రికా ప్రకటనలో భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తారని రాష్టప్రతి పేర్కొన్నారు. ఉత్పాదక రంగంపై దృష్టిపెట్టి చిన్న, మధ్యతరహా సంస్థల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు.