అదిలాబాద్

పేపర్‌మిల్లును తెరిపించడానికి ప్రయత్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*మంత్రి జోగు రామన్న
కాగజ్‌నగర్, మార్చి 15 : ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో మూతబడి ఉన్న సిర్పూర్ పేపర్‌మిల్లును తెరిపించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని, కాని ఈ మిల్లును నడపడానికి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడంలేదని రాష్ట్ర మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం ఆయన మిల్లులోని అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులతో స్తానిక రైల్వేస్టేషన్‌లో మాట్లాడారు. ఈ మిల్లును నడిపిస్తే ప్రభుత్వపరంగా అనేక రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ద్ధంగా ఉన్నప్పటికి ఎవరూ ముందుకురావడంలేదన్నారు. ఈ మిల్లును నడపాలని ముఖ్యమంత్రి కెసిఆర్ జెకె, ఫ్యాప్సి, ఐటిసి కంపెనీ ప్రతినిధులను ఆహ్వానించగా, వారు మిల్లును సందర్శించారన్నారు. ఈ మిల్లును నడపడానికి ఆయా కంపెనీలవారు ముందుకురావడంలేదని, ప్రభుత్వం మాత్రం ఐటిసి కంపెనీకి ఈ మిల్లును కట్టబెట్టడానికి సిద్ధ్దంగా ఉందని, అవసరమైన రాయితీలను ఇవ్వడానికి, అవసరమైతే 200 నుండి 250 కోట్ల వరకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ద్ధంగా ఉందన్నారు.
.... వారంలోగా బకాయిలు ఇప్పిస్తాం......
మిల్లులో పనిచేస్తున్న అత్యవసర విభాగ కార్మికులకు రావాల్సిన 3నెలల వేతన బకాయిలను కూడా ఇప్పిస్తామని మంత్రి జోగు రామన్న తెలిపారు. అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలను చెల్లించాల్సి ఉన్నందున సిఎంతో మాట్లాడి కలెక్టర్ ద్వారా వారికి వారంరోజుల్లోగా వేతన బకాయిలను ఇప్పిస్తామని మంత్రి అన్నారు. క్రూషియల్ బాలెన్స్ లేదా ఇతర మార్గం ద్వారా కార్మికులకు వేతనాల బకాయిలను ఇప్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే సమ్మయ్య, మిల్లుయూనియన్ కార్యదర్శి విశే్వశ్వర్ రావు, కార్మికులు, పాల్గొన్నారు.