జాతీయ వార్తలు

రైతు నేత జోషి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, డిసెంబర్ 12: రైతులకు గిట్టుబాటు ధర కోసం దేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు నడిపిన ప్రముఖ రైతు నాయకుడు శరద్ జోషి శనివారం ఇక్కడ కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధ వ్యాధులతో బాధపడుతున్న 81 ఏళ్ల జోషి ఇక్కడి తన నివాసంలో తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గొప్ప పరిశోధకుడు కూడా అయిన జోషి 2004 నుంచి 2010 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈ కాలంలో ఆయన 16 స్థారుూ సంఘాలలో సభ్యుడిగా పనిచేశారు. 1958-68 మధ్య కాలంలో ఇండియన్ పోస్టల్ సర్వీస్‌లో పనిచేసిన జోషి పిన్‌కోడ్ వ్యవస్థకు పునాది వేశారు. తరువాత కాలంలో అది తపాలా వ్యవస్థనే సమూలంగా మార్చివేసింది.
దశాబ్ద కాలం పాటు స్విట్జర్లాండ్ కేంద్రంగా గల ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యుపియు)లో సేవలందించిన జోషి స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత రైతాంగ సమస్యలపై ఉద్యమించడం ప్రారంభించారు. 1979లో షేట్కారి సంఘటనను స్థాపించిన జోషి దాని నేతృత్వంలో అనేక రైతాంగ ఉద్యమాలు నడిపారు. ఇక్కడికి సమీపంలోని చకన్‌లో ఈ సంస్థను ప్రారంభించిన జోషి నాసిక్ జిల్లాలో ఉల్లి రైతులకోసం దీర్ఘకాలిక ఉద్యమం నడపటం ద్వారా రైతు నాయకుడిగా వెలుగులోకి వచ్చారు. హింసాత్మక రూపం తీసుకున్న ఈ ఉద్యమం వల్ల పోలీసులు అప్పట్లో ఆయనను అరెస్టు చేశారు. ఆ తరువాత ఆయన చెరకు, వరి, పత్తి, పొగాకు రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కోసం వివిధ రాష్ట్రాల్లో ఉద్యమాలు నడిపారు.