అనువాదంలో జర్నీ-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడంలో విజయవంతమైన ముంజానీ చిత్రాన్ని తెలుగులో జర్నీ-2గా అనువదిస్తున్నారు. గణేశ్, మంజరి జంటగా ఎస్.నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై కొత్తూరు విఠల్ సమర్పణలో చిగులూరి గంగాధర్‌రావు చౌదరి తెలుగులో అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- స్వార్థం లేని ప్రేమ ఎంతో గొప్పదైతే, అటువంటి ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదని, తొలిచూపులోనే ప్రేమ కొందరికి పుడితే, ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు ఒకరినొకరు చూసుకోకుండా కవిత్వంతోనే ప్రేమలో పడతారని తెలిపారు. తామెవరన్నది ఒకరికొకరు తెలుసుకోకుండా సస్పెన్స్‌తో సాగే కథాంశంతో ఈ చిత్రం సాగుతుందని, ఈనెల రెండవ వారంలో సినిమా లోగోను, 20న ఆడియోను విడుదల చేసి జనవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు:శశాంక్ వెనె్నలకంటి, పాటలు:వెనె్నలకంటి, ఎడిటింగ్:ఇ.ఎమ్.నాగేశ్వరరావు, సహ నిర్మాతలు:వల్లభనేని కృష్ణమూర్తి, రాఘవేంద్రరావు, నిర్మాత:చిగులూరి గంగధర్‌రావు చౌదరి, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: ఎస్.నారాయణ. (చిత్రం) మంజరి

=======

సంక్రాంతికి కుర్ర తుఫాన్
సిక్స్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ పతాకంపై తేజ, తరుణ్, శ్రీరామ్‌చంద్ర ప్రధాన తారాగణంగా కృష్ణమోహన్ గొర్రెపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కుర్ర తుఫాన్’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఓ సైంటిఫిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం ఉంటుందని, ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. రెండు షెడ్యూల్స్‌లోనే చిత్రాన్ని పూర్తిచేసి, సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, యూత్‌ని టార్గెట్ చేస్తున్న ఈ చిత్రంలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని, ఫ్యామిలీ వర్గాలు కూడా చూసి ఆనందించేలా చిత్రీకరిస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: గోపాల్ సామరాజు, సంగీతం: టి.పి.్భరద్వాజ్, నిర్మాణం: సిక్స్ ఫ్రెండ్స్ క్రియేషన్స్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణమోహన్ గొర్రెపాటి.