కృష్ణ

సంక్షేమం, అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానంలో దేశానికి జిల్లా ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 11: సంక్షేమం, అభివృద్ధి సాంకేతిక పరిజ్ఞానంలో దేశానికి కృష్ణాజిల్లా ఆదర్శవంతంగా నిలపడంలో జిల్లా కలెక్టర్ బాబు ఎ న్యాయకత్వంలో టీం కృష్ణా చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 4వ విడత జన్మభూమి ముగింపు ఉత్సవాలను సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందరింలో నిర్వహించారు. సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ 678 జిల్లాల్లో కృష్ణాజిల్లా అన్నింటా ప్రత్యేకతను చాటుకోవడం గొప్ప విషయమన్నారు. నగదు రహిత లావాదేవీలలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిధన్ డ్రాలో ఒక్క కృష్ణాజిల్లా నుండి 6200 మంది బహుమతులు పొందడం జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి ఫలితమేనన్నారు. వీరందరికి ఒక్కొక్కరికి వేయ్యి రూపాయల చొప్పన వారి ఖాతాలో జమ అయ్యిందన్నారు. కేవలం పెన్షన్లు, రేషన్ సరఫరా, ఉపాధి హామీ కూలీలకు చెల్లిస్తున్న నగదు రహిత లావాదేవీల్లో ఈ బహుమతులు రావడం గొప్ప విషయమన్నారు. జిల్లా కలెక్టర్ బాబు ఎ మాట్లాడుతూ 1996వ సంవత్సరంలో జన్మభూమి నినాదంతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు అనేక ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమాల్లో ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు చొప్పున హాజరవడం జన్మభూమి కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఉన్న అవగాహనకు తార్కాణం అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ నగరంలో స్వచ్ఛ విజయవాడలో భాగంగా నూటికి నూరు శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి దోమలు రహిత నగరంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ సలోని సిదానాలతో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, గ్రామాలను దత్తత తీసుకున్న భాగస్వాములు, జన్మభూమి గ్రామసభల్లో పోటీల్లో గెలుపొందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11 మంది దత్తత గ్రామ భాగస్వాములకు అవార్డులు, వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను మంత్రి ప్రదానం చేశారు.

11 ఎబివిజె 5.జెపిజి విలేఖర్లతో మాట్లాడుతున్న మాజీ మంత్రి నెహ్రూ
జగన్‌వి పగటి కలలు
* బాబు శాశ్వత సిఎం
* నెహ్రూ, వెంకన్న, జలీల్‌ఖాన్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 11: క్షణాల్లో తాను ముఖ్యమంత్రిని అయిపోవాలి.. అందినంత దోచుకోవాలి, దాచుకోవాలనే తత్వం, తపన సరైంది కాదని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. 67 ఏళ్ల వయస్సులో కూడా రాష్ట్రం కోసం రాత్రీపగలు శ్రమిస్తున్న చంద్రబాబు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి మంచి పనినీ అవినీతితో ముడిపెట్టటం జగన్‌కు పరిపాటి అయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనే దురుద్దేశ్యంతోనే అన్ని సమస్యలే, ఏమీ జరగటం లేదనే దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ అతిథిగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ), ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ధ్వజమెత్తారు. నెహ్రూ మాట్లాడుతూ సాధారణంగా ఏ ప్రాజెక్టు అయినా నిర్మాణంలో జాప్యం జరుగుతుంటే అంచనాలు పెరుగుతూ పోతుంటాయన్నారు. అంతమాత్రాన దోచుకుతింటున్నారనే ఆరోపణలు సరికావన్నారు. 1987లో నాడు ఎన్టీఆర్ శంకుస్థాపన చేసే సమయంలో పులిచింతల ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.100 కోట్లు అయితే వైఎస్ హయాంలో వేల కోట్లకు చేరిందని, ఆ మొత్తం సొమ్మును దోచుకుతిన్నారనే భావించాలా? అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగిందని గుర్తుచేశారు. పట్టిసీమ ఏడాదిలో పూర్తికాదని, ఆ పథకాన్ని తొలుత తాను వ్యతిరేకించానన్నారు. వైఎస్ హయాంలో కాలువలు తవ్వటం వల్ల కూడా ఏడాదిలో పూర్తయిందన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు తొలుత శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. వాస్తవానికి పట్టిసీమ వల్ల కృష్ణాడెల్టా ఆయకట్టు సస్యశ్యామలం అయిందన్నారు. నేడు చంద్రబాబు ఏదీ ఆశించడం లేదని, కేవలం పేరుప్రతిష్ఠల కోసం పరితపిస్తున్నారని, రాజధాని నిర్మాణం ఆయన స్వప్నమంటూ అదికూడా సాధించగలరన్నారు. ఏమైనా లోపాలు, ఎక్కడైనా అవినీతి ఉంటే ఎత్తిచూపాలి కాని చంద్రబాబుపై రాళ్లు రువ్వండి, రేపోమాపో పదవీచ్యుతుడు అవుతారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి దుర్దినం వచ్చేదని, అందుకే ప్రజలు తిరస్కరించారని నెహ్రూ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ చంద్రబాబును మోసగాడని చెప్పే జగన్ 420 కేసుల్లోనే జైలుకెళ్లి నేడు వారంవారం జైలు మెట్లు ఎక్కి దిగుతున్నాడన్నారు. దోచుకోటం, దాచుకోటం మినహా పెట్టేవాడు కాదంటూ ఆయన తీరు నచ్చకనే ఇప్పటికి 21 మంది ఎమ్మెల్యేలు బైటకు వచ్చారని సంక్రాంతి తర్వాత మరికొందరు రానున్నారన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో విజయసాయిరెడ్డి కోసం ప్రతి ఎమ్మెల్యేకు రూ.2కోట్లు చొప్పున ఇవ్వబట్టే ఆ కొందరైనా ఆగారని ఆరోపించారు. జగన్ కుటుంబ పాలనలో పులివెందులలో రక్తం పారితే, నేడు చంద్రబాబు పుణ్యమాని నీరు పారుతోందన్నారు. ఇక సొంతిల్లు కూడా లేని కెవిపి జలయజ్ఞంలో కోట్లకు కోట్లు కమీషన్లు కొట్టేశారని ఆరోపించారు. నేడు పోలవరం కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల కోసమే అవినీతి పేరిట అభూత కల్పనలతో లేఖలపై లేఖలు రాస్తున్నాడని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ వైఎస్ ఆత్మగా చెప్పుకునే కెవిపి తన స్వార్థంతో రోశయ్య, తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి శరీరంలోకి ప్రవేశించాడనేది గుర్తించాలన్నారు. పోలవరం కాలువ తవ్వకాల్లో అపార అవినీతి ప్రవహించిందని, చివరకు మట్టిని కూడా అమ్ముకున్నారని ఆరోపించారు. స్వార్థపరుడైన జగన్ ముఖ్యమంత్రి అయి ప్రజలనేమి ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. తండ్రి చనిపోయినపుడే కంటతడి లేకుండా సిఎం పదవి కోసం తహతహలాడారని, సొంత బాబాయిని నిర్బంధించి బి ఫారం తెచ్చుకున్నాడని గుర్తుచేశారు. కన్నతల్లి విశాఖలో పోటీ చేసినా పట్టించుకోలేదని, చివరకు చెల్లెలు షర్మిలను కూడా పక్కన పెట్టాడంటూ వెంకన్న నిప్పులు చెరిగారు.