జాతీయ వార్తలు

జైట్లీ బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 2016-17 సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను సోమవారం లోక్‌సభకు సమర్పించారు. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వివరించారు. రైతులకు రుణాలు, సేంద్రియ వ్యవసాయం, సాగునీటి వసతి, భూగర్భ జలాల పెంపు, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, మార్కెటింగ్ సౌకర్యాలు, విత్తనాల సరఫరా, వ్యవసాయ రుణాలు, పప్పు్ధన్యాల సేకరణ, పాడి పరిశ్రమకు ఈసారి బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు జైట్లీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వ్యవసాయ రంగంతో పాటు గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, ఉపాధి కల్పన, సంస్కరణలు, పాలన వంటి విషయాలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కార్లు, సిగరెట్ల ధరలు పెరుగుతాయని, రిఫ్రెజిరేటర్లు, ఇతర గృహోపకరణాల ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్‌ రూ. 19.78 లక్షల కోట్లు
---------------------------------------
కేంద్ర బడ్జెట్‌ రూ. 19.78 లక్షల కోట్లు అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. దీనిలో ప్రణాళికా వ్యయం రూ. 5.5 లక్షల కోట్లు కాగా ప్రణాళికేతర వ్యయం రూ. 14.28 లక్షల కోట్లని ఆయన అన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు ఉండవని ఆయన తెలిపారు.
---------------------