హైదరాబాద్

ఆగని వరస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డివిజన్ల రిజర్వేషన్ల తర్వాత మరింత జోరు
తెరాస గూటికి చేరుతున్న నేతలు

హైదరాబాద్, డిసెంబర్ 22: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అధికార తెరాస పార్టీలోకి వలసలు ఆగటం లేదు. ఇప్పటికే తెరాసలో అనేకమంది నేతలు చేరగా, త్వరలో డివిజన్ల రిజర్వేషన్లు ఖరారైన తర్వాత మరింత భారీ సంఖ్యలో ఈ పార్టీలో చేరేందుకు టిడిపి, కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎన్నికల నాటికి వలసలు అత్యధిక సంఖ్యలో పెరిగే అవకాశాలున్నాయి. రెండురోజుల క్రితం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె.ఎం.ప్రతాప్‌తో పాటు మరికొందరు నేతలు కెటిఆర్ ఆధ్వర్యంలో తెరాసలో చేరిన సంగతి తెలిసిందే. కేవలం జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలోనే గాక, గతంలో తెలంగాణ బిల్లు కేంద్రంలో ఆమోదం పొందిన తర్వాత నగరంలోని టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఇప్పటికే తెరాస తీర్థం పుచ్చుకోగా, తెలంగాణ రాష్ట్రం వచ్చి, తెరాస అధికారం చేపట్టిన తర్వాత మరికొందరు ఆ పార్టీలోకి వలసబాట పట్టిన సంగతి తెలిసిందే. ఈరకంగా ఇప్పటివరకు మాజీ కార్పొరేటర్లు, ఇతర బడా నేతలతో కలిపి మొత్తం 24 మంది కాంగ్రెస్, టిడిపిలకు చెందిన నేతలు వలసలు వెళ్లారు. గ్రేటర్ మొట్టమొదటి పాలకమండలిలో అధికార పార్టీ పక్ష నేతగా వ్యవహరించిన కాలేరు వెంకటేశ్, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి తరఫున ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించిన సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే తెరాసలో తేరిన సంగతి తెలిసిందే. అయితే వీరేగాక, మరో 30 మంది మాజీ కార్పొరేటర్లు తెరాసలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వీరిలో టిడిపి, కాంగ్రెస్‌కు చెందిన వారే ఎక్కువమంది ఉన్నారు. బిజెపితో టిడిపి పొత్తు ఉండటంతో సీట్ల కేటాయింపులో తమ డివిజన్లు మిత్రపక్షమైన పార్టీకి ఖాతాలోకి వెళ్లే అవకాశముందన్న సమాచారాన్ని తెల్సుకున్న మరికొందరు నేతలు రేపోమాపో తెరాసలో చేరనున్నారు. ఈ రకంగా ఏర్పాట్లు చేసుకున్న వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అయిదుగురు, మరో పదకొండు మంది టిడిపి నేతలున్నట్లు సమాచారం. మొత్తానికి మహానగరంలో అసెంబ్లీ నియోజకవర్గాలు, డివిజన్ల వారీగా క్యాడర్ మాట దేవుడెరుగు గానీ, కనీసం కమిటీలు కూడా లేని తెరాస పార్టీ రహస్యంగా అమలుచేస్తున్న ఆకర్ష్ స్కీం అధినాయకుల అంచనాల మేరకు బాగానే ఫలిస్తున్నా, మేయర్ పీఠమే లక్ష్యంగా ఆ పార్టీ చేస్తున్న సమీకరణలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.
కాంగ్రెస్ ఎన్నికల సారథి ఎవరు?
గొడవలన్నీ సద్దుమణిగి, ఇప్పటికైనా ఎన్నికల్లో పార్టీ కోసం ఒకటయ్యారని చెప్పుకునే కాంగ్రెస్ నేతల ముందు మరో సమస్య వచ్చి పడింది. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాజీ మంత్రి దానం నాగేందర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించరాదంటూ ఇప్పటికే టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి పలువురు నేతలు కోరారు. దీంతో దానం నాగేందర్ మరోసారి ఇరకాటంలో పడ్డారు. కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని ఆయన ప్రతికూల వర్గ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సూచిస్తున్న క్రమంలో టిపిసిసి దానంను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తుందా? ఆయన స్థానంలో ఎవర్ని నియమించనుంది? ఎన్నికల బాధ్యతలు లేకుండా నాగేందర్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? వేచి చూడాలి!