జాతీయ వార్తలు

నిప్పుతో చెల‌గాటం ఆడుతున్నారు: జ‌స్టిస్ మిశ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సంప‌న్నులు, శ‌క్తివంత‌మైన వాళ్లు సుప్రీంకోర్టును బ్లాక్‌మెయిల్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, కానీ వాళ్లు నిప్పుతో చెల‌గాటం ఆడుతున్నార‌న్న వాస్త‌వాన్ని గ్ర‌హించాల‌ని జ‌స్టిస్ మిశ్రా హెచ్చ‌రిక‌లు చేశారు. ఉత్స‌వ్ సింగ్ బెయిన్స్ వేసిన కేసులో వాద‌న‌లు విన్న త‌ర్వాత జ‌స్టిస్ అరుణ్ మిశ్రా ఈ కామెంట్స్ చేశారు. ఎవ‌రైనా వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేయాల‌ని భావిస్తే, వారిని అంతం చేసేందుకో లేక నిర్వీర్య ప‌రిచేందుకు కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌న్నారు. లైంగిక వేధింపుల కేసులో చీఫ్ జ‌స్టిస్‌ను ఇరికించేంద‌కు ఓ శ‌క్తివంత‌మైన గ్యాంగ్ ప‌నిచేస్తున్న‌ట్లు ఉత్స‌వ్ కోర్టులో పిటిష‌న్ వేశారు. అజ‌య్ అనే వ్య‌క్తి సీజేఐపై కేసు వేయాలంటూ త‌న‌ను ఆశ్ర‌యించిన‌ట్లు న్యాయ‌వాది ఉత్స‌వ్ పేర్కొన్నాడు. ఈ కేసు విచార‌ణ చేపట్టిన సుప్రీం బెంచ్ ఇవాళ వాద‌న‌లు విన్న‌ది. డ‌బ్బులేక రాజ‌కీయ శ‌క్తితోనే సుప్రీంకోర్టు న‌డ‌వ‌ద‌ని తెలుసుకోవాల‌ని దేశ ప్ర‌జ‌లు వాస్త‌వం తెలుసుకోవాల‌ని, జ‌స్టిస్ మిశ్రా అన్నారు.