జాతీయ వార్తలు

అసహనం.. రాజకీయ అంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉన్నంతవరకు భయం అక్కర్లేదు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్ వ్యాఖ్య

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: అసహనం అనేది రాజకీయ అంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ ఆదివారం వ్యాఖ్యానించారు. అంతేకాదు న్యాయవ్యవస్థ స్వతంత్రం గా ఉన్నంతవరకు, చట్టాలు పటిష్ఠంగా పని చేసినంతకాలం భయపడాల్సిన అవసరం లేదని కూడా ఆయ న అన్నారు. ‘ఇది రాజకీయ సమస్య. మనకు స్వతంత్రమైన న్యాయ వ్యవస్థ ఉంది. అంతేకాదు మనకు చట్టాలు ఉన్నాయి. స్వతంత్రమైన న్యాయ వ్యవస్థ ఉన్నంతకాలం, కోర్టులు ప్రజల హక్కులు, బాధ్యతలను పరిరక్షించినంతకాలం ఎవరు కూడా దేనిగురించీ భయపడాల్సిన పని లేదు’ అని ఠాకూర్ ఇక్కడ పాత్రికేయులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అన్నారు. చట్టాలను పరిరక్షించే, ప్రతి పౌరుడి హక్కులను కాపాడే వ్యవస్థకు తాను అధిపతిగా ఉన్నానని ఆయన చెప్తూ, తన వ్యవస్థ(జ్యుడీషియరీ)కు ప్రతి పౌరుడి హక్కులను కాపాడే సా మర్థ్యం ఉందని తాను నమ్ముతున్నానని అన్నారు. అసహనం అనేది ఒక భావన అని అంటూ, రాజకీయ నాయకులు దీన్ని ఎలా ఉపయోగించుకుంటారనే దానిపై తాను ఎలాంటి వ్యాఖ్యా చేయబోనని ఆయన చెప్పారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉన్నంతవరకు ఎలాంటి భయం అక్కర్లేదన్నారు. చట్టాలను పరిరక్షించడానికి, సమాజంలోని ప్రతి పౌరుడి, అన్ని వర్గాలు, మతాల ప్రజల హక్కులను పరిరక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాం. సమాజంలోని ఏ వర్గమూ భయపడాల్సిన అవసరం లేదు’ అని ఆయన చెప్పారు. (చిత్రం) సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్