హైదరాబాద్

జువనైల్ చట్టాన్ని సవరించి నిర్భయ నిందితుడిని కఠినంగా శిక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: మూడు ఏళ్ల క్రిందట ఢిల్లీలో నిర్భయ అత్యంత ఘోరంగా అత్యాచారానికి గురై మరణించింది. ఆ నిందితుల్లో ఒకడైన జువనైల్‌ను విడుదల చేయడాన్ని ఖండిస్తూ స్టాన్లీ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. సత్యప్రసాద్ లంక మాట్లాడుతూ మూడు ఏళ్ళ క్రిందట నిర్భయ అత్యాచార సంఘటనను ఇప్పటికీ దేశం మర్చిపోలేదని అన్నారు. నిందితుల్లో ఒకడైన జువనైల్‌ను చట్టాల పేరు చెప్పి విడుదల చేయడం అత్యంత హేయమనీ, నిజానికి జువనైల్‌గా చెబుతున్న వ్యక్తి అత్యాచార సంఘటనలో అతి కిరాతకంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. కావున జువనైల్ చట్టాన్ని సవరించి అతనికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. దేశం అత్యాచారాలకి ఆలవాలంగా తయారైందనీ, అశ్లీల అసభ్య సినిమాలు, సాహిత్యాల వలనా, మద్యం విధానంతో మహిళపై రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. డా. వి.అనురాధ మట్లాడుతూ నిర్భయ సంఘటన తర్వాత తీసుకొచ్చిన నిర్భయ చట్టం అత్యాచారల్ని నివారించడంలో గానీ, నిందితుల్ని శిక్షించడంలో గానీ ఘోరంగా విఫలమైందని అన్నారు. ఏ మాత్రం అధికారాలివ్వకుండా కేవలం కాగితంలో రాసుకున్నంత మాత్రాన ఏ సమస్యా తీరదని చెప్పారు. అత్యాచారాల్ని నిరోధించడానికీ, నిందితులకి వెంటనే శిక్షపడేలా రూపొందించిన జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టాలు బలహీనంగా ఉంటే ఏ రకంగా అత్యాచారాల్ని నిరోధిస్తారని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాల్ని నిర్మిస్తామని అన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. ఎ.కనకదుర్గ మాట్లాడుతూ తెలంగాణలో మద్యం పాలసీ వల్ల జరిగే నష్టాలను వివరించారు. ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులకు అనుమతులివ్వడం జవలన మహిళలకు రక్షణ లేకుండా పోతోందని అన్నారు. పసిపాపల నుండి వృద్ధుల వరకూ మహిళలకు రక్షణ కరవైందని చెప్పారు. ఉన్నత నీతి, నైతిక విలువలు అలవర్చుకోవడంతో సాంస్కృతిక సంక్షోభానికి అడ్డుకట్ట వేయగలమన్నారు. ఉమన్స్ ప్రొటెక్షన్ సెల్ కన్వీనర్ వాసంతి అధ్యక్షత వహించారు. ప్రొటెక్షన్ సెల్ సభ్యులు భ్రమరాంబ, సౌమ్య, పద్మశ్రీ, స్రవంతి, గంగాధర్ పాల్గొన్నారు.