జువ్వ పాటలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంజిత్, పాలక్ లల్వాని జంటగా సోమి ఫిలిమ్స్ పతాకంపై భరత్ సోమి నిర్మించిన చిత్రం ‘జువ్వ’. ఈ చిత్రం ఆడియో విడుదలైంది. బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి ఝాన్సీ అతిథులుగా హాజరైన కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, సంగీత దర్శకుడు కీరవాణి, అడివి శేష్, హాస్యనటులు అలీ, సప్తగిరి, భద్రమ్, చిత్ర దర్శకుడు త్రికోటి, మాటల రచయిత రత్నం, మలయాళ నటుడు అర్జున తదితరులు పాల్గొన్నారు. దర్శకుడు వి.వి.వినాయక్ ఆడియో సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కీరవాణిమాట్లాడుతూ- దర్శకుడు త్రికోటి నాకు చాలా ఏళ్లుగా తెలుసు. అతని మొదటి సినిమా దిక్కులు చూడకు రామయ్య చిత్రానికి నేనే సంగీతం అందించాను. ఇది పక్కా కమర్షియల్ సినిమా. ప్రేక్షకులకు ఒక విందు భోజనం లాంటిది. హీరో రంజిత్ డాన్స్, ఫైట్స్ చాలా బాగా చేశాడు. హీరోగా అతడికి మంచి భవిష్యత్తు ఉంది. కమర్షియల్ సినిమాలతోపాటు ఆఫ్‌బీట్ సినిమాలు చేసి స్టార్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి టీజర్ విడుదల చేశారు. ఇపుడు దర్శకుడు వి.వి.వినాయక్ ఆడియో విడుదల చేస్తున్నారు. సినిమా విజయవంతమై అందరికీ పేరు తేవాలని కోరుకుంటున్నానన్నారు. మాటల రచయిత ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ- దర్శకుడు త్రికోటి చాలా తెలివైనవాడు. సినిమా అతనికి మంచి గుర్తింపుని తెస్తుంది అన్నారు. నటుడు అలీ మాట్లాడుతూ- సాధారణంగా కేరళ నుంచి తెలుగు పరిశ్రమకు హీరోయిన్లు వచ్చేవారు. కాని మొదటిసారిగా అర్జున అనే విలన్‌ని పరిచయం చేస్తున్నారు ఈ సినిమా ద్వారా. పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయని అన్నారు. సప్తగిరి మాట్లాడుతూ- కీరవాణికి నేను పెద్ద అభిమానిని. కేవలం పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసం బాహుబలి చిత్రాన్ని ఏడుసార్లు చూశాను. అలాగే ఈ జువ్వ సినిమాలో డిఫరెంట్ గెటప్‌లో మిమ్మల్ని నవ్వించే ప్రయత్నంచేశాను అన్నారు. దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ- మా కుటంబానికి ఆప్తమిత్రుడు బొత్స సత్యనారాయణ. ఆయన సతీమణి ఝాన్సీ, వారి అల్లుడు ఈ సినిమా నిర్మాత భరత్ సోమికి శుభాకాంక్షలు. తమ్ముడిమీద అభిమానంతో హీరోగా పరిచయం చేస్తున్న భరత్‌కు అభినందనలు. ఈ సినిమా ద్వారా రంజిత్‌కు మంచి నటుడిగా గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. అలాగే కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించడం చాలా గొప్ప విషయం. సినిమా తప్పకుండా విజయం సాధించాలి అన్నారు. దర్శకుడు త్రికోటి మాట్లాడుతూ- దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన సాయి కొర్రపాటికి, రాజవౌళికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. హీరో రంజిత్ మాట్లాడుతూ- నా తొలి సినిమాకే కీరవాణి లాంటి సంగీత దర్శకుడు సంగీతాన్ని అందించడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత భరత్ తదితరులు మాట్లాడారు. రంజిత్, పాలక్ లల్వాని, అర్జున, పోసాని కృష్ణమురళి, అలీ, సప్తగిరి, మురళీ శర్మ, రఘుబాబు, ప్రభాకర్, విజయ్‌చందర్, ఆనంద్, ఐమాక్స్ వెంకట్, పింగ్ పాంగ్ సూర్య, జబర్దస్త్ శ్రీను, షేకింగ్ శేషు, ప్రభాస్ శ్రీను, భద్రం, సురేఖావాణి, సన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: ఎ.ఎం.రత్నం, పాటలు: అనంత్ శ్రీరామ్, వశిష్ట్, ఎడిటింగ్: కోటగిరి, తమ్మిరాజు, కెమెరా:సురేష్ లగుతు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, స్క్రీన్‌ప్లే, నిర్మాత: భరత్ సోమి, దర్శకత్వం: త్రికోటి.

ఛలో దర్శకుడికి క్రేజీ ఆఫర్?

ఛలో.. ఈమధ్య విడుదలైన ఈ చిన్న సినిమా పెద్ద విజయం దిశగా దూసుకుపోతోంది. రెండు రాష్ట్రాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లు అందుకుంది. త్రివిక్రమ్ దగ్గర పనిచేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగశౌర్య సొంత బ్యానర్‌లో నిర్మించారు. ఈ సినిమాతో అటు దర్శకుడిగా, ఇటు రచయితగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు వెంకీ. దాంతో వెంకీ కుడుములకు భారీ ఆఫర్ దక్కింది. ఆయనతో సినిమా చేసేందుకు తాజాగా పవన్‌కళ్యాణ్‌తో హారిక హాసిని బ్యానర్‌లో సినిమా చేయమని అడిగారట. త్రివిక్రమ్ సొంత బ్యానర్ లాంటి హారిక హాసినిలో ఆయన శిష్యుడు వెంకికి ఈ భారీ అవకాశం రావడం నిజంగా గొప్ప విషయమే. ఇప్పటికే ఓ లైన్ చెప్పాడని.. లైన్ నచ్చడంతో స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. సో త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి.