రాష్ట్రీయం

కొడిగినెహళ్లిలో ఇంటెలిజెన్స్ ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, జనవరి 22: సెంట్రల్ వర్శిటీకి విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న నేపధ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. రోహిత్ విద్యాభ్యాసం చేసిన పాఠశాలలు, కళాశాలలనుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నాయి. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని కొడిగెనహళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గురుకుల కళాశాలలో శుక్రవారం ఇంటెలిజెన్స్ వర్గాలు రోహిత్ వివరాలు సేకరించాయి. 2004-06 విద్యాసంవత్సరంలో రోహిత్ ఇక్కడ ఇంటర్మీడియట్ బైపిసి చదివాడు. వేముల ఆర్.చక్రవర్తిగా అతని పేరు కళాశాల రికార్డుల్లో నమోదైంది. గుంటూరు జిల్లా గురజాలకు చెందిన రోహిత్ పదో తరగతిలో 512 మార్కులు సాధించి గురుకుల కళాశాల ప్రవేశ పరీక్షలో మెరిట్ ద్వారా కొడిగెనహళ్ళి కళాశాలలో సీటు సాధించాడు. ఆ సమయంలో గుంటూరు జిల్లా గురజాల తహసీల్దార్ ద్వారా ఎస్సీ మాలగా కుల ధృవీకరణ పత్రం పొంది సమర్పించినట్లు కళాశాల రికార్డులు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తుత ప్రిన్సిపాల్ కొండయ్య ధ్రువీకరించారు.