బిజినెస్

కోలుకోని మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 16: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్‌లో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ దేశీయంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో, దీని ప్రభావం మరికొన్ని బ్యాంకులపై సుదీర్ఘకాలం ఉండొచ్చన్న మదుపరుల ఆందోళన నేపథ్యంలో స్టాక్‌మార్కెట్‌లో వరుసగా మూడోరోజూ గందరగోళం కొనసాగింది. మదుపరులు ఇంకా అనిశ్చితిలోనే ఉన్నారు. మొత్తంమీద ట్రేడింగ్‌లో వారాంతం నష్టాలనే నమోదు చేసింది. దాదాపు ప్రధానమైన ప్రభుత్వరంగ బ్యాంకులు గణనీయంగా నష్టాలను నమోదు చేశాయి. బుధవారం తిరోగమన ఫలితాలు సాధించిన స్టాక్‌మార్కెట్ గురువారం ఉదయం లాభాలతో లావాదేవీలు ప్రారంభమైనప్పటికీ సాయంత్రానికి నష్టాల్లోనే ముగిసాయి. బీఎస్‌ఈ, నిఫ్టీ సూచీలు నష్టాలనే ప్రతిబింబించాయి. గురువారం లావాదేవీలు లాభాల దిశగా ప్రారంభంకాగా ఒకదశలో సెనె్సక్స్ 34,508.24 పాయింట్లకు చేరుకుంది. అయితే ఆ తరువాత ఒడిదుడుకులకు లోనై సాయంత్రానికి 287 పాయింట్లు పతనమై 34,010 పాయింట్ల వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ సూచీ ఒక దశలో 34,508 పాయింట్లను తాకి ఆ తరువాత 33,957.33 పాయింట్లకు పడిపోయి చివరకు 34.010 పాయింట్లవద్ద స్థిరపడింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 93.20 పాయింట్లు పతనమై 10,452.30 పాయింట్లవద్ద స్థిరపడింది.
స్టాక్‌మార్కెట్ వారాంత ఫలితాల్లో బీఎస్‌ఈ, నిఫ్టీ సూచీలు రెండూ పతనానే్న నమోదు చేశాయి. సెనె్సక్స్ 5 పాయింట్లతో స్వల్ప పెరుగుదలను నమోదు చేసినప్పటికీ నిఫ్టీ 2.65 పాయింట్లతో నేలచూపులు చూసింది. బుధవారం నాడు విదేశీ మదుపరులు రూ. 240.29 కోట్ల మేర షేర్లను విక్రయించగా దేశీయ మదుపరులు కేవలం 49.92 కోట్ల విలువైన షేర్లను మాత్రమే కొనుగోలు చేశారు. గురువారంనాడు ఆటో, మెటర్, పీఎస్‌యూ, కేపిటల్ గూడ్స్, భవన నిర్మాణరంగం, బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్ల క్రయవిక్రయాలు విస్తృతంగా సాగా యి. కాగా రూ.11,400 కోట్ల కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్ల విలువ భారీగా పడిపోయింది. వరుసగా మూడోరోజూ అదే ఫలితం కనిపించింది. గడచిన మూడు రోజుల్లో పీఎన్‌బీ షేర్ల విలువ దాదాపు 8700 కోట్ల రూపాయల మేర పడిపోయింది. మార్కెట్‌లో జనవరి నెలలో నెలకొన్న వాణిజ్య లోటు మరింత పెరగనుందని, ఇది వాణిజ్య అస్థిరతకు దారితీస్తుందని మార్కెట్ నిపుణుడు వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. మదుపరుల సెంటిమెంట్ బలహీనపడిన నేపథ్యంలో గతనెలలో వాణిజ్యలోటు భారీగా నమోదైందని, అయితే దిగుమతులు బాగా పెరిగాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో మన ఎగుమతులు 26.1 శాతం అంటే 24.38 బిలియన్ డాలర్ల మేరకు పెరిగాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రసాయనాలు, ఇంజనీరింగ్ వస్తువులు, పెట్రో ఉత్పత్తుల ఎగుమతులు పెరగడంతో ఇది సాధ్యమైందని తెలిపారు. నిఫ్టీ పీఎస్‌యు బ్యాంకు సూచీ 2.49 శాతం పడిపోగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.84 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 3.55 శాతం, యూనియన్ బ్యాంక్ 1.25 శాతం, పీఎన్‌బీ 2.10 శాతం, ఎస్‌బీఐ 2.25 శాతం మేరకు నష్టాలను చవిచూశాయి. గీతాంజలి జెమ్స్ దాదాపు 20 శాతం షేర్ల విలువను కోల్పోయి భారీ నష్టాలను భరించాల్సి వచ్చింది.
మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకి, భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎల్ అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌బ్యాక్, టాటా మోటార్స్, కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్, ఆర్‌ఐఎల్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటార్స్ బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ, ఐటీసీ, ఎమ్ అండ్ ఎమ్ 2.31 శాతం మేరకు షేర్లను కోల్పోయాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ మాత్రం 0.96 మేరకు లాభాలను ఆర్జించాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో గురువారం క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదలను నమోదు చేయగా డాలర్ విలువ మూడేళ్ల కనిష్ఠానికి చేరింది. మరోవైపు చైనాలో కొత్త సంవత్సరం సందర్భంగా పలు ఆసియా మార్కెట్లు సెలవు ప్రకటించాయి.