ఆంధ్రప్రదేశ్‌

కాపు సభకు పెరుగుతున్న మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 22: వెనుకబడిన కులాల జాబితాలో కాపులను చేర్చాలన్న డిమాండ్‌తో తూర్పుగోదావరి జిల్లా తునిలో ఈనెల 31న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో జరుపతలపెట్టిన భారీ బహిరంగ సభకు మద్దతు పెరుగుతోంది. ఈసారి ఉద్యమాన్ని ఉద్ధృతంగా సాగిస్తే తప్ప లక్ష్యాన్ని సాధించలేమన్న అభిప్రాయం కాపు సామాజికవర్గంలో వ్యక్తమవుతుండటంతో కిందిస్థాయి నుండి కదలికవస్తోంది. ప్రతి గ్రామం నుండి ఒకటి నుండి రెండు బస్సుల్లో తుని బహిరంగ సభకు తరలివచ్చేందుకు కాపు వర్గానికి చెందిన వారు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఈసారి రాయలసీమ జిల్లాల నుండి కూడా అధిక సంఖ్యలో కాపులు తరలిరానున్నట్టు సమాచారం అందుతోంది. తెలంగాణ జిల్లాల నుండి కూడా వస్తారని కాపు సంఘాల నాయకులు చెబుతున్నారు. తెలుగుదేశం మినహా మిగిలిన అన్ని పార్టీలూ ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో జరగనున్న బహిరంగ సభకు పూర్తి సహకారాన్ని అందించాలని నిర్ణయించాయి. కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ఆ పార్టీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నాయకులతో ప్రాంతీయ కాపు కాగ్రెస్ సదస్సులను నిర్వహిస్తోంది. ఈ సదస్సులకు రాజమహేంద్రవరంలోనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శ్రీకారం చుట్టింది. బిసి జాబితాలో ఉన్న కులాలకు ఎలాంటి నష్టం కలుగకుండా, కాపులను బిసి జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌తో ప్రత్యక్ష ఉద్యమాలను సాగించాలని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం వేదికపై నుండే పిలుపునిచ్చింది. ముద్రగడ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతునిస్తుందని ప్రకటించిన పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, తుని సభకు తరలివెళ్లాల్సిందిగా సూచించారు. రాష్ట్రప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ మాత్రం వ్యూహాత్మకంగా తునిలో జరగనున్న సభను అడ్డుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.