కృష్ణ

రైతు సంక్షేమానికి కట్టుబడ్డాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంటుమిల్లి, ఫిబ్రవరి 22: ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ అన్నారు. ఇటీవల ఎఎంసీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన గుడిశేవ మహాలక్ష్మి అధ్యక్షతన గురువారం తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత మాట్లాడుతూ ప్రభుత్వం రైతు పక్షపాతి అన్నారు. రైతు రుణమాఫీ, ధాన్యానికి మద్దతు ధర ఇవ్వటం, రైతులకు నేరుగా నగదు బదిలీ తదితర కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. మార్కెట్ యార్డు అభివృద్ధికి తనవంతు సహకారం ఉంటుందన్నారు. మహాలక్ష్మి మాట్లాడుతూ మార్కెట్ యార్డు నిధులతో లింకు రోడ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి ఆహర్నిశలు కృషి చేస్తానన్నారు. 34 మంది రైతులకు రైతు బంధు చెక్కులను ఎమ్మెల్యే కాగిత అందజేశారు. పెడన మండలం నందమూరు నుండి కలవగుంటపాలెం లింకు రోడ్డుకు రూ.5లక్షలు మంజూరైనట్లు కాగిత తెలిపారు. ఈ సమావేశంలో ఎంఎసీ చైర్మన్ ఎండి అమీర్, కృత్తివెన్ను జెడ్పీటీసీ ఒడుగు తులసీరావు, మార్కెట్ యార్డు కార్యదర్శి ఎం నాగేందర్, కమిటీ సభ్యులు కందుల చామండేశ్వరి, దాసరి బాలజేసు, కాసులు, కందుల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.