కృతిసనన్ సోదరి ఎంట్రీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా రంగంలోకి హీరోయిన్లుగా వెలుగొందాలనే కోరిక ఎవరికుండదు చెప్పండి. ఇక హీరోయిన్‌గా ప్రూవ్ అయినవాళ్లయితే వారి వారి సోదరీమణులను కూడా ఈ రంగంలోకి దింపుతుంటారు. ఇప్పటికే ఇలా చాలామంది వచ్చారు. ఈ కోవలో తాజాగా మరో క్రేజీ భామ ఎంట్రీ ఇస్తోంది. మహేష్‌బాబు సరసన వన్ (నేనొక్కడినే) చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కృతిసనన్ తెలుగుతోపాటు హిందీలో కూడా మంచి పేరే తెచ్చుకుంది. తాజాగా ఈ భామ షారుక్ హీరోగా నటించిన దిల్‌వాలే చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు ఈ భామ చెల్లెలు నుపూర్ సనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోందట. ‘దిల్‌వాలే’ చిత్రంలో ‘జానమ్ జనామ్’ అనే పాటను పాడి మేకింగ్ వీడియోగా తయారుచేసిందట. ఆ పాటకు యూట్యూబ్‌లో భారీ క్రేజ్ రావడంతో ఈమెను హీరోయిన్‌గా చేయాలని ప్రయత్నాలు చేస్తోంది కృతి. ఇప్పటికే ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట. మరి సినీ రంగంలో ఏ హీరోయిన్ చెల్లి కూడా స్టార్ ఇమేజ్‌ను తెచ్చుకోలేకపోయింది. మరి నుపూర్ సంగతేంటో చూడాలి!