రాష్ట్రీయం

కరడుగట్టిన ఉగ్రవాది నఫీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: హైదరాబాద్‌లో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ అరెస్టు చేసిన నలుగురు ఉగ్రవాదులు జనూద్ ఉల్ ఖలీఫ్ ఇ హింద్‌కు చెందిన వారని పోలీసు వర్గాలు తెలిపాయి. జనూద్ ఉల్ ఖలీఫ్ ఇ హింద్ అంటే ఆర్మీ ఆఫ్ ఖలీఫ్ ఆఫ్ ఇండియా. వీరు ఐఎస్‌ఐస్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఏర్పాటు చేసిన ఈ సంస్ధలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో షఫీ ఆర్మర్ అలియాస్ యూసఫ్ విదేశాల్లో ఉంటూ చురుకైన పాత్ర వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం అరెస్టయిన నఫీజ్ ఖాన్ పేరు మోసిన ఉగ్రవాది అని పోలీసులు భావిస్తున్నారు. నఫీజ్ ఖాన్ టోలీ చౌకీకి చెందినవాడు. అబూ జరార్‌గా పేరు మార్చుకున్నాడు. కర్నాటకకు చెందిన అటవీ ప్రాంతంలో నఫీజ్ ఆయుధ శిక్షణ పొందాడు. ఈ శిక్షణకు చాలా మంది సానుభూతిపారులను తీసుకెళ్లినట్లు అభియోగాలున్నాయి. యాసిన్ భత్కల్‌ను జైలు నుంచి విడిపించేందుకు వీరు పన్నాగం పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఎన్‌ఐఏ అరెస్టు చేసిన ఆర్మర్ ఇక్కడి జైలులో ఉన్న యాసిన్ భత్కల్‌ను విడిపించేందుకు పథక రచన చేసినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. నఫీజ్ ఖాన్ అమోనియం నైట్రేట్, గన్ పౌడర్‌ను సేకరించి ఉంచుకున్నట్టు పోలీసులు పసిగట్టారు. నఫీజ్ ఖాన్‌కు పెళ్లి అయిందని పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఐఎస్‌ఐఎస్ ముంబయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముబ్బీర్ ముస్తాఖాతో నఫీజ్ ఖాన్ సంబంధాలు కలిగి ఉన్నాడని అభియోగాలు ఉన్నాయి. ముదబ్బీర్, యూసుఫ్ అనే మరో ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరులతో ఆన్‌లైన్ ద్వారా నఫీజ్ ఖాన్ సంబంధాలు ఏర్పరచుకున్నాడు. 33 సంవత్సరాల ముదబ్బీర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతను అబూ ముసబ్ అనే పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. నఫీజ్‌కు ముసబ్ నుంచి నిధులు అందుతున్నాయి. విదేశాల్లో ఉన్న యూసుఫ్‌తోనూ నఫీజ్‌కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. యూసుఫ్ అలియాస్ షఫీ ఆర్మర్ సోదరుడే సుల్తాన్ ఆర్మర్. ఇతను మంచిర్యాలకు చెందిన వాడు. ఐఎస్‌ఐఎస్ తరఫున పోరాడుతూ మరణించాడు. తన సోదరుడు మరణించిన తర్వాత షఫీ యూసుఫ్‌గా పేరుమార్చుకుని అన్సర్ ఉల్ తవీద్ అనే సంస్ధను ఏర్పాటు చేశాడు. ఇండియన్ ముజాహిదీన్ సంస్ధకు అనుబంధంగా ఈ సంస్ధ పని చేస్తోంది. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో మంచిర్యాలకు చెందిన సుల్తాన్ ఆర్మర్ నిందితుడుగా ఉన్న విషయం విదితమే.