క్రీడాభూమి

కొన్టా సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 25: బ్రిటిష్ క్రీడాకారిణి జొహన్నా కొన్టా ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌లో సోమవారం సంచలన విజయాన్ని నమోదు చేసింది. మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో ఆమె 4-6, 6-4, 8-6 ఆధిక్యంతో 21వ సీడ్ ఎకతరిన మకరోవాను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. 32 ఏళ్ల తర్వాత ఒక గ్రాండ్ శ్లామ్‌లో క్వార్టర్స్ చేరిన తొలి బ్రిటిష్ మహిళగా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించింది. గత ఏడాది సెమీ ఫైనల్స్ వరకూ చేరిన మకరోవాపై గెలిచేందుకు ఆమె సర్వశక్తులు కేంద్రీకరించి పోరాడి, చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. 1984 వింబుల్డన్‌లో జో డ్యురీ క్వార్టర్ ఫైనల్స్ వరకూ వెళ్లింది. అయితే, సెమీ చేరలేకపోయింది. హనా మాండ్లికోవా చేతిలో ఆమెకు 1-6, 4-6 తేడాతో ఓటమి ఎదురైంది. కాగా, డ్యురీ తర్వాత గ్రాండ్ శ్లామ్ టోర్నీలో క్వార్టర్స్ చేరిన మొదటి బ్రిటిష్ మహిళగా కొన్టా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.
మహిళల సింగిల్స్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో ఏడో సీడ్ ఏంజెలిక్ కెర్బర్ 6-4, 6-0 స్కోరుతో అనికా బెక్‌పై విజయం సాధింది. 14వ సీడ్ విక్టోరియా అజరెన్కా 6-2, 6-4 స్కోరుతో బార్బొరా స్ట్రయికోవాను ఓడించి క్వార్టర్స్‌లో స్థానం సంపాదించింది. క్వాలిఫయర్ జాంగ్ షుయ్ 3-6, 6-3, 6-3 తేడాతో 15వ సీడ్ మాడిసన్ కీస్‌పై గెలుపొంది సంచలనం సృష్టించింది.
క్వార్టర్స్ చేరిన సానియా, బొపన్న
భారత టెన్నిస్ స్టార్లు సానియా మీర్జా, రోహన్ బొపన్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో తమతమ విభాగాల్లో క్వార్టర్ పైనల్స్ చేరారు. మహిళల డబుల్స్‌లో మార్టినా హింగిస్‌తో కలిసి ఆడుతున్న సానియా మూడో రౌండ్ మ్యాచ్‌లో స్వెత్లానా కుజ్నెత్సొవా, రాబర్టా విన్సీ జోడీని 6-1, 6-3 తేడాతో చిత్తుచేసింది. గత ఏడాది రెండు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించిన ‘సాంటినా’ (సానియా, మార్టినా హింగిస్) జోడీ ఈఏడాదిని ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌తో శుభారంభం చేసే జోరుమీద ఉంది.