కాజోల్.. కహానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య కాలంలో బాలీవుడ్‌లో లిప్‌లాక్‌లకు కొదవే లేకుండాపోయింది. ఏ సినిమాలో చూసినా అవసరం వున్నా లేకున్నా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఈ తరహా లిప్‌లాక్ సన్నివేశాలతో రక్తికట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ముద్దుసన్నివేశంతో సంచలనం సృష్టిస్తోంది నాటి గ్లామర్ తార కాజోల్. వెండితెరపై ఎవర్ గ్రీన్ లవ్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న కాజోల్, షారూఖ్‌ల జంట అంటే అందరికీ క్రేజే. వీరిద్దరు కలిసి ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయింగె’తో మొదలుపెట్టి మరో నాలుగు చిత్రాల్లో నటించారు. తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన ‘దిల్‌వాలే’ చిత్రం బాక్సాఫీసువద్ద బోల్తాపడింది. వీరిద్దరి కెమిస్ట్రీ ఈ సినిమాకు పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ ఈ సినిమా మేకింగ్ వీడియోలో షారుఖ్, కాజోల్‌ల లిప్‌లాక్ సన్నివేశాన్ని బయటికి వదిలింది ఈ టీమ్. దాంతో వీరిద్దరి ముద్దు సన్నివేశం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో ఈ వీడియోని వీక్షిస్తున్నారట ప్రేక్షకులు. ఏదేమైనా లేటు వయసులో కూడా కాజోల్ ప్రేక్షకులకు కిక్ ఇస్తోంది.