రాష్ట్రీయం

కృష్ణాడెల్టాకు నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఫిబ్రవరి 5: నాగార్జునసాగర్ జలాశయం నుండి కృష్ణాడెల్టాకు శుక్రవారం రాత్రి నుండి నీటివిడుదలను జెన్‌కో అధికారులు ప్రారంభించారు. కృష్ణాడెల్టా పరిసర ప్రాంతాలలో తాగునీటి అవసరాల నిమిత్తం 4టిఎంసిల నీటిని విడుదల చేసే విధంగా కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయం మేరకు శ్రీశైలం జలాశయం నుండి సాగర్ జలాశయంకు నీటివిడుదల చేస్తున్నారు. ఈ విషయంలో డ్యాం అధికారుల ఆదేశాల కొరకు జెన్‌కో అధికారులు ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటూ అవసరం మేరకు నీటివిడుదల చేస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం రాత్రి 10గంటల నుండి జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి నీటివిడుదల చేశారు. కాగా ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుండి నాగార్జునసాగర్ జలాశయానికి 10,143క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకుంటుంది. దీనిలో ప్రధాన జల విద్యుత్ కేంద్రం నుండి కృష్ణాడెల్టాకు 1626క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బిసి ద్వారా 800 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 508 అడుగులకు చేరుకుంది. మరో రెండు అడుగులు చేరితే కనీస నీటిమట్టం 510 అడుగులకు చేరుకుంటుంది. శ్రీశైలంలో శుక్రవారం నాటికి 829.40 అడుగులుగా ఉంది.