రాష్ట్రీయం

కీలక ఘట్టం నేడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: రక్షణ రంగంలో భారతదేశ శక్తి, సామర్థ్యాలు ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. పొరుగు దేశాల ముందు మన సత్తా నిరూపించుకునే వేదిక సిద్ధమైంది. విశాఖలో గత రెండు రోజులుగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలోని కీలక ఘట్టానికి శనివారం విశాఖ తీరం ఆతిథ్యమిస్తోంది. సర్వ సైన్యాధ్యక్షుడు, భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల సత్తాను సమీక్షించనున్నారు. శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి 11.25 గంటల వరకూ సాగే ఈ సమీక్షలో వందకు పైగా యుద్ధ నౌకలు 70కి పైగా యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా సుమిత్ర యుద్ధ నౌకలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసనంపై రాష్టప్రతి కూర్చుంటారు. ఆయన పక్కన ప్రధాన మంత్రి, మరోపక్క రక్షణ మంత్రి కూర్చుంటారు. ఆయన వెనుక త్రివిధ దళాధిపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీనులవుతారు. రాష్టప్రతి యుద్ధ నౌక ఎక్కడానికి ముందు 21 మంది సాయుధ నౌకాదళ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఆయన వెంట మరొక యుద్ధ నౌక ప్రయాణిస్తుంది. దాని వెంట మీడియా నౌక ప్రయాణిస్తుంది. అప్పటికే దేశ, విదేశీ యుద్ధ నౌకలు ఆరు వరుసలుగా సాగరంలో బారులు తీరి ఉంటాయి. ఒక్కో యుద్ధ నౌకను దాటుకుంటూ రాష్టప్రతి నౌక ముందుకు సాగుతుంది.
యుద్ధ సమయంలోనే కాకుండా, సాధారణ సమయాల్లో కూడా తమ నౌకాదళ బలాన్ని అన్ని దేశాలూ సమీక్షించుకుంటున్నాయి. దీనే్న ఫ్లీట్ రివ్యూ అంటారు. రాష్టప్రతి గౌరవార్థం ఈ ఫ్లీట్ రివ్యూని నిర్వహిస్తుంటారు. 1415లోనే హెన్రీ-5 తొలిసారిగా ఇటువంటి ఫ్లీట్ రివ్యూ చేసినట్టు తెలుస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1953 అక్టోబర్ 19న తొలి ఫ్లీట్ రివ్యూలో అప్పటి రాష్టప్రతి బాబూ రాజేంద్రప్రసాద్ నౌకా సమీక్ష నిర్వహించారు.
గత ఫ్లీట్ రివ్యూలు
భారత దేశంలో ఇప్పటివరకూ 10 సార్లు ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలు జరిగాయి. ఇందులో తొమ్మిది ఫ్లీట్ రివ్యూలు వెస్ట్ కోస్ట్ అంటే ముంబైలోనే జరిగాయి. 2006లో మాత్రమే తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖలో జరిగింది. తొమ్మిది ఫ్లీట్ రివ్యూల్లో రాష్టప్రతులు పాల్గొన్నారు. 1964లో జరిగిన ఫ్లీట్ రివ్యూలో మాత్రం అప్పటి రక్షణ శాఖ మంత్రి వైబి చౌహాన్ పాల్గొన్నారు.
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ
ఇవి ఆయా దేశాల్లో చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఒక్కో సమయంలో ఒక్కో దేశం ఈ ఫ్లీట్ రివ్యూకి ఆతిథ్యమిస్తుంది. 1953లో మొదటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలకు భారత దేశం ఇప్పటి వరకూ ఒక్కసారి మాత్రమే ఆతిథ్యమిచ్చింది. 2001లో ముంబైలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. దాదాపు 15 సంవత్సరాల తరువాత భారతదేశంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతోంది. దీనికున్న మరో విశేషం ఏంటంటే.. ఈ ఫ్లీట్ రివ్యూకి తూర్పు తీరం తొలిసారిగా ఆతిథ్యమిస్తోంది. ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సుమారు 50 దేశాల నుంచి యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు వస్తున్నాయి.
ప్రపంచానికి కొత్త సందేశం
ఇంటర్మేషనల్ ఫ్లీట్ రివ్యూ ద్వారా భారతదేశం ప్రపంచానికి కొత్త సందేశాన్ని ఇవ్వనుంది. భారత్ యుద్ధతంత్రం, యుద్ధ నైపుణ్యత, ఆయుధ సంపత్తి, స్వదేశీ పరిజ్ఞానం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచ దేశాలకు చాటిచెప్పనుంది. దీంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలు భారత దేశానికి సైనిక పరంగా ఇస్తున్న మద్దతు కూడా ఫ్లీట్‌కు దూరంగా ఉన్న దేశాలకు తెలుస్తుంది.
ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూల వివరాలు
1953 అక్టోబర్ 19: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్
1964 ఏప్రిల్ 20: వైబి చౌహాన్ (రక్షణ శాఖ మంత్రి)
1966 ఫిబ్రవరి 10: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
1969 డిసెంబర్ 28: వివి గిరి
1976 జనవరి 11: ఫకృద్దీన్ అలీ ఆహ్మద్
1984 ఫిబ్రవరి 12: జ్ఞానీ జైల్ సింగ్
1989 ఫిబ్రవరి 15: ఆర్‌వి రామన్
2001 ఫిబ్రవరి 12: కెఆర్ నారాయణన్
(ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ)
2006 ఫిబ్రవరి 13: ఎపిజె అబ్దుల్ కలామ్
2011 డిసెంబర్ 20: ప్రతిభాపాటిల్