కథ వింటే చెప్పేస్తా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాది భాషల్లో టాప్ హీరోయిన్‌గా ఫాలోయింగ్ సంపాదించుకున్న గ్లామర్ భామ కాజల్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. దాదాపు పది సంవత్సరాలుగా క్రేజీ హీరోయిన్‌గా వున్న ఈ భామ ఇనే్నళ్లు కొనసాగడానికి కారణమేంటనే సీక్రెట్‌ని బైటపెట్టింది. కథానాయికగా కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో ఎవరు కథ చెప్పినా వినేదాన్నని, దానివల్ల ఫలితమెలా వున్నా అనుభవం మాత్రం వచ్చిందని చెబుతోంది. ఇలా చేయడంవల్ల కథలపై ఆలోచించే అవకాశం కలిగిందని, దాంతో ఎవరు ఏ కథ చెప్పినా జడ్జిమెంట్ చేయగల పరిజ్ఞానం అబ్బిందని చెబుతోంది. ఎవరైనా కథ చెప్పినపుడు కథతోపాటు అందులో నా పాత్రను ఎలా మలిచారనే విషయాన్ని గమనిస్తానని, అవి బాగున్నపుడే సినిమా చేయడానికి ఒప్పుకుంటానని చెబుతోంది. మొత్తానికి పదేళ్లలో మంచి అనుభవాన్ని సొంతం చేసుకున్న ఈ గ్లామర్ భామ మరికొనే్నళ్లు హీరోయిన్‌గా కొనసాగుతుందనడంలో ఎలాంటి డౌటూ లేదు. ప్రస్తుతం పవన్ సరసన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, మహేష్ సరసన ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ హిందీలో రణదీప్ హుడా సరసన ‘దో లఫ్జోంకి కహాని’ చిత్రంలో నటిస్తోంది. అన్నట్టు ఈ చిత్రంలో ఓ ఘాటు లిప్‌లాక్ కూడా చేసింది. మొత్తానికి కాజల్ గడుసుదేనని అంటున్నారు సినీ జనాలు.