బిజినెస్

కిలో రూ. 5!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, ఫిబ్రవరి 12: చిత్తూరు జిల్లా మదనపల్లె టమోటా వ్యవసాయ మార్కెట్‌లో టమోటా ధరలు పడిపోతున్నాయ. ఫలితంగా రైతులు నష్టాల పాలవుతున్నారు. రైతులంతా పంటను మార్కెట్‌కు తరలించడంతో డిమాండ్ కంటే అధికంగా సరఫరా జరిగి ధరలు పతనమవుతున్నాయ. మరోవైపు కర్నాటక రాష్ట్రంలోని చింతామణి, వాయల్పాడుతోపాటు అనంతపురం, కడప జిల్లాల్లో పండించిన టమోటాలు కూడా మదనపల్లె మార్కెట్‌కు వస్తున్నాయ. దీంతో స్థానిక రైతులకు నిల్వ చేసుకునే సౌకర్యం లేక పంట పాడైపోతుందని వచ్చిన ధరలకే అమ్ముకుంటున్నారు. ఫలితంగా కిలో టమోటా 5 రూపాయలు పలుకుతుండగా, తమిళనాడు, చత్తీస్‌గడ్, మహారాష్ట్ర, పాండిచ్చేరి రాష్ట్రాలకు టమోటా ఎగుమతి అవుతోంది.