బిజినెస్

మార్చి 17న కింగ్‌ఫిషర్ హౌస్ వేలం: బ్యాంకర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: కింగ్‌ఫిషర్ హౌస్‌ను వచ్చే నెలలో బ్యాంకర్లు వేలం వేయనున్నారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా సారథ్యంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. బ్యాంకులకు పెద్ద ఎత్తున బకాయిపడినది తెలిసిందే. ఈ నేపథ్యంలో 6,963 కోట్ల రూపాయల బకాయిలను వసూలు చేసుకోవడంలో భాగంగా ముంబయిలోని కింగ్‌ఫిషర్ హౌస్‌ను మార్చి 17న ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని బ్యాంకుల కూటమి వేలం వేయాలని నిర్ణయించుకుంది. ఎస్‌ఎఆర్‌ఎఫ్‌ఎఇఎస్‌ఐ చట్టం 2002 ప్రకారం ఈ వేలాన్ని నిర్వహించనున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో 2,401.70 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కింగ్‌ఫిషర్ హౌస్‌ను బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయి. సిటీ ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న దీని విలువ 150 కోట్ల రూపాయలుగా బ్యాంకులు వెలకట్టాయి.