రంగారెడ్డి

ఖైదీలకు మంచి సదుపాయాలు: నాయిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఫిబ్రవరి 12: తెలంగాణలోని జైళ్లలో ఖైదీలకు మంచి సదుపాయాలు కల్పిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మాదాపూర్- స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో చంచల్‌గూడ జైలు ఖైదీలు వేసిన చిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ, గతంలో జైలంటే చాలా బాధగా వుండేదని నేడు జైళ్లలో మంచి వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఖైదీలలో మార్పు తీసుకురావడంతోపాటు మంచి భోజనం, వసతి, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఆయన వివరించారు. రాబోయే బడ్జెట్‌లో కొంత మొత్తాన్ని ఆ శాఖకు కేటాయించి మరింత ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల ఖైదీలతో ఆయుర్వేద ఆసుపత్రిని సైతం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఖైదీలు శిక్షా కాలంలో పనిచేసిన డబ్బులు బయటకు వెళ్లినపుడు ఎంతగానో ఉపయోగపడతాయని, ఆ డబ్బుతో ఏదొక పని చేసుకుని నేరాల బాట పట్టకుండా వుండవచ్చన్నారు. చర్లపల్లి, చంచల్‌గూడ, వరంగల్ జైళ్లలోని ఖైదీలకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా వున్నాయని, వారు తయారుచేసిన బేకరీ పదార్థాలు సైతం తమ క్యాంటిన్‌లో విక్రయిస్తున్నారని అన్నారు. శిక్షాకాలంలో వారిలో వున్న నైపుణ్యానికి పదునుపెట్టి వేసిన చిత్రాలు ఎంతగానో ఆలోచింప చేస్తున్నాయని నాయిని కితాబిచ్చారు. అవసరమైతే ఈ ప్రదర్శనను ఢిల్లీలోను ఏర్పాటు చేస్తామని అన్నారు. 22 మంది ఖైదీ చిత్రకారులు వేసిన 75 చిత్రాలు ప్రదర్శనలో వుంచారు. ఈ ప్రదర్శన 14 వరకు వుంటుందని క్యురేటర్ సయ్యద్ తెలిపారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ డిజి వి.కె.సింగ్, డిఐజి నర్సింహ ఇతర అధికారులు పాల్గొన్నారు.