కుమారి జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అలా ఎలా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హేబాపటేల్ ఆ తర్వాత దర్శకుడు సుకుమార్ కంట్లోపడడంతో ఆయన రాసిన కథతో వచ్చిన ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో కథానాయికగా అవకాశాన్ని కొట్టేసింది. రాజ్‌తరుణ్ సరసన నటించి, మంచి క్రేజ్ పొందిన హేబా ప్రస్తుతం జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఓ మల్టీస్టార్ చిత్రంలో నటిస్తోంది. ఏలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో మోహన్‌లాల్, గౌతమి కలిసి నటిస్తున్న ఓ చిత్రంలో కూడా యంగ్ హీరోయిన్‌గా హేబాపటేల్ నటిస్తోంది. ‘రారాకృష్ణయ్య’ దర్శకుడు పి.మహేష్ నేతృత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఆ చిత్రంలో శర్వానంద్ సరసన నటిస్తోంది. ఇవి కాకుండా ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో కూడా అవకాశాన్ని పొందింది. మొత్తంమీద ఒక్క సినిమా హిట్ అవ్వడంతో హేబాపటేల్ రాత్రికి రాత్రే సూపర్‌స్టార్‌గా ఎదిగింది. అదీ లక్కంటే!