జాతీయ వార్తలు

కరవు సాయంగా మరో 280 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కేంద్ర ప్రభుత్వం కరవు పరిహారం కింద రాష్ట్రానికి మరో 280 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం జరిగిన హోంశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహెర్శీతోపాటు హోం, ఆర్థిక, వ్యవసాయ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఉన్నతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర కరువు బృందం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన అనంతరం అందజేసిన నివేదిక, సిఫారసులను పరిశీలించిన అనంతరం రాష్ట్రానికి జాతీయ ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి నుంచి 280.19 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు అసోంకు 332.57 కోట్లు, హిమాచల్‌ప్రదేశ్‌కు 170.19 కోట్లు, నాగాలాండ్‌కు 16.02 కోట్లు, జార్కండ్‌కు 336.94 కోట్లు, రాజస్తాన్‌కు 1177.59 కోట్లు, తమిళనాడుకు 1773.78 కోట్లు కేటాయించాలని ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో నిర్ణయించారు.