రాష్ట్రీయం

ఖరారైన రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో, ఇక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడమే తరువాయని రాజకీయ వర్గాలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. మార్చిలో ప్రారంభంకానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే, నోటిఫికేషన్ వేస్తే ఎన్నికల తంతు పూర్తి చేసేందుకు సర్కారు సైతం సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 58 డివిజన్లు ఉన్నాయి. వీటిలో ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళ 1, ఎస్సీ జనరల్ 1, ఎస్సీ మహిళ 5, మహిళలకు నాలుగు వార్డులు రిజర్వ్ చేశారు. బీసీ జనరల్ 10, బీసీ మహిళ 15, అన్ రిజర్వ్‌డ్ వార్డులు 13 ఉన్నాయి. ఇక ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉన్నాయి. వీటిలో ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళ 1, ఎస్సీ జనరల్ 3, ఎస్సీ మహిళ 3, బీసీ జనరల్ 9, బీసీ మహిళ 8, జనరల్ మహిళ 13, అన్‌రిజర్వ్‌డ్ వార్డులు 12 ఉన్నాయి. రిజర్వేషన్ల ఖరారుతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి మార్గం సుగమమైంది. ఆశావహులు బరిలోకి దిగేందుకు ముమ్మర ప్రయత్నాల్లో నిమగ్నమవుతున్నారు.