బిజినెస్

కోలుకోని ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశీయ ఎగుమతులు ఇంకా కోలుకోవడం లేదు. వరుసగా 14వ నెల క్షీణిస్తూ, గత నెల జనవరిలో 21 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గత ఏడాది జనవరితో పోల్చితే ఇది 13.6 శాతం తక్కువ కావడం గమనార్హం. పెట్రోలియం, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. మరోవైపు దిగుమతులు కూడా 11 శాతం తగ్గి 28.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్య లోటు 7.63 బిలియన్ డాలర్లుగా ఉంది. క్రిందటిసారి ఇది 6.85 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా, బంగారం దిగుమతులు ఈ జనవరిలో ఏకంగా 85 శాతం పెరిగాయి. 2.91 బిలియన్ డాలర్లకు చేరాయి. గత ఏడాది జనవరిలో ఇవి 1.57 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. దీంతో కరెంట్ ఖాతా లోటు మళ్లీ పెరగవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశీయ దిగుమతుల్లో ముడి చమురు దిగుమతుల తర్వాత అత్యధికంగా జరుగుతున్నవి పసిడి దిగుమతులే. ఇది కరెంట్ ఖాతా లోటు పెరుగుదలకు దారితీస్తుండటంతో గతంలో పుత్తడి దిగుమతులపై ప్రభుత్వం పన్నును పెంచి కొంతవరకు అదుపులోకి తీసుకువచ్చింది. అయితే కరెంట్ ఖాతా లోటు తగ్గడంతో ఆ పన్నును కేంద్రం సడలించగా, ఇప్పుడు మళ్లీ బంగారం దిగుమతులు పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే బంగారం దిగుమతిలో భారత్ తొలి స్థానంలో ఉంది. ఇకపోతే గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు జరిగిన బంగారం దిగుమతుల విలువ 29.36 బిలియన్ డాలర్లుగా ఉంది. పోయినసారి ఇది 27.42 బిలియన్ డాలర్లుగా ఉంది.